అనధికార నిర్మాణాలు, ప్రయివేట్ హోర్డింగ్స్ గుర్తించండి : నగర మేయర్ గుండు సుధారాణి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:35
Identify unauthorized structures, private hoardings : The mayor of the city is Gundu Sudharani

హనుమకొండ,  సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)/...జిడబ్లుఎంసి పరిధిలోఅనధికార నిర్మాణాలు, ప్రయివేట్ హోర్డింగ్స్ గుర్తించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధానకార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో అనధికార నిర్మాణాలు, హోర్డింగ్స్ లపై సమీక్షించి సమర్ధంగా నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలు సులువుగా, వెగవంతంగా భవన నిర్మాణాల అనుమతులు పొందుటకు రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బి పాస్ ను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు.  భవన నిర్మాణానికి టీఎస్బిపాస్ లో దరకాస్తూ చేసుకొన్న 21 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలన్నారు. అనధికార నిర్మాణాలు జరుగకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. చైన్మెన్లు, టిపిబిఓ లు వారి వారి డివిజన్లలో క్షేత్ర స్థాయిలో ప్రతిరోజుతిరిగి అనుమతి లేకుండా నిర్మించే భవనాలు, డివియేషన్ ల వివరాలు పై అధికారులకు తెలియజేసి అలాంటి నిర్మాణాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా అనధికార హోర్డింగ్స్ ల వివరాలు సేకరించి వాటిని క్రమబద్దీకరించి బల్దియా ఆదాయం పెరిగేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.డివియేషన్ కు పోకుండా, అనధికార అంతస్తు కట్టకుండా టి డి ఆర్ లను ప్రజలు వినియోగించుకొనెలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్నారు.

రెసిడెన్షియల్ అనుమతి పొంది, కమర్షియల్ గా వినియోగించుకొంటున్న భవనాలను కూడా గుర్తించాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో డాకుమెంట్ వేరిఫికేషన్, క్షేత్ర స్థాయిలో సైట్ ఇన్స్పెక్షన్ క్షుణ్ణంగా నిర్వహించిన పిదప నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉందన్నారు. ఈ సమీక్షలో సిటీ ప్లానర్ వెంకన్న, ఉప కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, జోనా, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రావు, బషీర్, సుష్మ, టిపిఎస్ లు శ్రీకాంత్, అనిల్ కుమార్, తేజశ్విని, రోజా రెడ్డి, వెంకట రమణ, సంధ్య, టిపిబిఓ ఖాజా షరీఫ్, నరేందర్, రాజు, ఇరిగేషన్ ఏ ఈ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.