నాగార్జునసాగర్‌ జలాశయంలో 12గేట్లు ఎత్తివేతఎస్‌ఈ ధర్మానాయక్‌

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 11:51
HSE Dharmanayake lifts 12 gates in Nagarjunasagar reservoir

*ఇన్‌ ఫ్లో -1లక్ష 43వేల 876క్యూసెక్కులు వరద 
*12క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల

వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌(నిడమనూరు),సెప్టెంబర్04(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 12క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు. శ్రీశైలం నుంచి వరదనీరు వస్తుండటంతో నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు సాగర్‌ డ్యాం కొన్ని రోజులుగా నాగార్జునసాగర్‌ జలాశయంలో ఆదివారం సాయంత్రం 12గేట్లు తెరిచారు.12గేట్లను05అడుగులు ఎత్తి 96వేల324క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌,డీఈ పరమేష్‌ తెలిపారు.అదేవిధంగా ప్రస్తుతం సాగర్‌ కు ఇన్‌ ఫ్లో 1లక్ష 43వేల876క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జున సాగర్‌ జలాశయం అధికారులు 12గేట్లను ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు.శ్రీశైలానికి  వరద ప్రవాహం కొనసాగుతుందని నాగార్జునసాగర్ డ్యామ్‌ డీఈ పరమేష్‌ తెలిపారు. అదేవిధంగా నాగార్జునసాగర్‌  డ్యామ్‌ డీఈ పరమేష్‌ మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది.

ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలకు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం ఇంకా వరద వచ్చే అవకాశం ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న జలాశయాలు పూర్తిగా నిండటంతో శ్రీశైలం డ్యామ్‌ వరద వస్తుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుదుత్పత్తి చేయడంతో సాగర్‌ కు వరద కొనసాగుతొంది.నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 589.30అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 309.9534టీఎంసీలు పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయం నుంచి కుడికాల్వకు8755క్యూసెక్కులు, ఎడమకాల్వకు6634క్యూసెక్కుల, పవర్‌ హౌజ్‌ ద్వారా 32886క్యూసెక్కులు,ఎస్‌ ఎల్‌ బిసి కాల్వకు0క్యూసెక్కులు,ఎల్‌ ఎల్‌ సి 400క్యూసెక్కులు,క్రస్ట్ గేట్ల  ద్వారా 96వేల324క్యూసెక్కులు ,డిస్‌ చార్జీ  1లక్ష26వేల287క్యూసెక్కులు,మొత్తంఅవుట్ ఫ్లో  ద్వారా 1లక్ష 43వేల876క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునట్లు సాగర్‌ డ్యామ్‌ డీఈ పరమేష్‌ పేర్కొన్నారు.