సీఎం కేసీఆర్‌ ఆసరాతో పేదలకు చేయూత

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 11:48
 Helping the poor with the support of CM KCR

లబ్ధిదారులకు పెన్షన్‌ కార్డులు పంపిణీ చేసిన డిసిసిబి డైరెక్టర్
తుంగతుర్తి, సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి);  మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన ఆసరా పెన్షన్‌ కార్డులను ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ తో కలిసి బుధవారం గొట్టిపర్తి, బాపనిబాయి తండా, ఎనే కుంట, మానాపురం,రావులపల్లి, రావులపల్లి x రోడ్డు తండా, వెంపటి, రామన్నగూడెం, దేవుని గుట్ట తండా,వెలుగుపల్లి, తూర్పు గూడెం తదితర గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీ పేదింటి పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచారని,  పేద అవ్వకు, అయ్యకు  కష్టం రాకూడదని డిజిటల్‌ కార్డుల పంపిణీకి సీఎం కేసీఆర్‌ కృషి చేశారని అన్నారు. నూతన రాష్ట్రం సాధించి బంగారు కలలు సకారం చేసుకుంటున్నామని, కొత్త రాష్ట్రం అయిన అన్ని రాష్ర్టాల కంటే అభివృద్ధిలో మొదటి స్థానంలో దూసుకుపోతున్నామని అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తుందని, ప్రతి ఒక్కరికి పెన్షన్‌ కార్డులు అందుతాయని తెలియజేశారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 600 రూపాయలు పెన్షన్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 2016 రూపాయలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  అర్హులైన వారికి కొత్త పింఛన్లు కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఒక గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, దళిత బంధు పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు చందా వెంకన్న, భద్రమ్మ, వయ్యా యాదమ్మ, బుజ్జి, నీలమ్మ, వెంకన్న, అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్, వీరోజి, గుగులోతు కాంతి, గుజ్జ పూలమ్మ, మామిడి వెంకన్న,ఎంపీటీసీలు కేతిరెడ్డి లతా విజయ్ కుమార్ రెడ్డి, మంగితి, గుండగాని వీరస్వామి, ఆంగోతు నరేష్, మట్టపల్లి కవితా కుమార్,టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలు తునికి లక్ష్మమ్మ, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు,ఆయా గ్రామాల కార్యదర్శులు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, లబ్ధిదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.