పౌష్టికాఆహారంతోనే బాలింతలు, గర్భిణీలకు ఆరోగ్యం

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:45
Health of infants and pregnant women only with nutritious food

జైనూర్ సెప్టెంబర్ 24:( ప్రజా జ్యోతి):  పౌష్టికాహారం తోనే గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యంగా ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పెంటు బాయి అన్నారు. శనివారం మండలంలోని జామిని గ్రామపంచాయతీలో పోషణ,పౌష్టికాహారం కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి భుసి మెట్ట, రాసి మెట్ట, జామిని గ్రామ ల గర్భిణీ, బాలింత లకు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం 10 (పదిమంది) గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జామిని సర్పంచ్ రాహుల్, గ్రామపంచాయతీ కార్యదర్శి, రాసి మెట్ట సర్పంచ్, బూసి మెట్ట సర్పంచ్, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.