
తేదీ: 09/03/2023,
సిరిసిల్ల జిల్లా.
పార్టీ పునాదులు వేసిన దివంగత నేత కుమారుడు.
సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలో పార్టీ పునాదులు వేసిన దివంగత బిజేపి నాయకులు గూడ దుర్గారెడ్డి కుమారుడు శ్రీరామ్ ప్రవీణ్ రెడ్డి. చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి, కరుడు గట్టిన కాషాయవాది. సోషల్ మీడియాలో పార్టీ పోస్ట్ లు పెడుతూ నేరుగా పార్టీ కార్యక్రమలకు పాల్గొనకపోయినా బిజేపి రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజీ ని నిర్వహిస్తూ, పార్టీకి విదేయుడిగా ఉన్నారు. తన తండ్రి మరణం తర్వాత, మొదటి సారి రాష్ట్ర పార్టీ ఆఫీస్ కి ఉదయం చేరుకొని చక్రధర్ రెడ్డి బిజేపి లో చేరిక ఏర్పాట్లు పర్యవేక్షించడం అందరికి ఉత్సాహం నింపింది. దుర్గారెడ్డి లేని లోటు పుడ్చాలని, పార్టీ కి ఎల్లపుడు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కోరారు.
- 17 views