రైతులకు గొప్ప లాభసాటి మొక్కజొన్న

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 15:03
Great benefit for farmers corn

ఏరియా మేనేజర్ మధు కృష్ణ

కావేరి సీడ్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంట ప్రదర్శన

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): మొక్కజొన్న అన్ని కాలాలకు సంబంధించిన పంట అని తెగుళ్ళను తట్టుకుని నిలబడి రైతులకు లాభసాటిగా మారుతుందని కావేరి సీడ్స్ ఏరియా మేనేజర్ మధు కృష్ణ గురువారం రైతులకు తెలిపారు. మొక్కజొన్న పంట పై క్షేత్ర దర్శనం ప్రదర్శన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం లో జరిగింది. మొక్కజొన్న  పంట ప్రదర్శన క్షేత్రం గంగా కావేరి సీడ్స్ ఆధ్వర్యంలో. జికె (3122)  మొక్కజొన్న పంట పై గురువారం ఉదయం ప్రదర్శన క్షేత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ మధుకృష్ణ మాట్లాడుతూ జికె. 3122 మొక్కజొన్న రకం వర్షాకాలము మరియు యాసంగికి అనుకూలమైన విత్తనం గా పేర్కొనబడింది  3122 . పలురకాల తెగుళ్ళను తట్టుకునే శక్తి ఉందన్నారు.జి కె  3122 నారింజ రంగు కలిగి సన్నటి బెండు తో ఉంటుంది అన్నారు.ఇతర రకాలతో పోలిస్తే అధిక దిగుబడి ఉంటుందని చెప్పడం జరిగింది. గ్రామానికి చెందిన రైతు. ఏ. యాకయ్య  పొలం లో నిర్వహించిన ఈ  కార్యక్రమంలో కేసముద్రం చుట్టుపక్కల గ్రామాల నుండి 120 మంది రైతులు పాల్గొన్నారు. ఈ క్షేత్ర ప్రదర్శనల్లో డిస్ట్రిబ్యూటర్:- పల్లవి ట్రేడర్స్ సతీష్, మరియు వోలం బసవరాజు  కేసముద్రం డీలర్లు. ఏరియా మేనేజర్ మధుకృష్ణ మరియు టెర్రిట్టరీ మేనేజర్ శంకర్ మరియు కంపెనీ మహబూబాబాద్ ప్రతినిధి.రవి మరియు గణేష్ పాల్గొన్నారు.