నాంపల్లి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:39
Grand Gandhi Jayanti celebrations in Nampally

 -నాంపల్లి సర్పంచ్ కుంభం విజయకృష్ణారెడ్డి
- మండల తాసిల్దార్ లాల్ బహుదూర్ శాస్త్రి

నాంపల్లి, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి ): ప్రపంచానికి సరికొత్త పోరాటం మార్గాన్ని, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను ఆయుధాలుగా మలుచుకుని దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ కుంభం విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, మండల తహాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో లాల్ బహుదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆదివారం నాడు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీజీ జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు గాంధీజీ అని కొనియాడారు. మహనీయుడు చూపిన శాంతియుత మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు కుంభం విజయకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎండి. సత్తార్, త్రివేణి సంగమం చైర్మన్ ఈదశేఖర్,వార్డు మెంబర్లు పంగ కొండయ్య, గాదెపాక  వేలాద్రి,నాయకులు సత్తయ్య, మంగలి హనుమంత్, అడ్వకేట్ కోరే కిషన్,శ్రీనివాస్,గాదేపాక నాగరాజు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.