మహిళా కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:35
Grand Bathukamma celebrations in women's college

హనుమకొండ, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి).//...తెలంగాణ ఆడపడుచుల అత్యంత ప్రీతి పాత్రమైన బతకమ్మ పండుగను మహిళ క్లబ్, ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో  వైభవంగా నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ఆవరణ ని  ముగ్గులతో అలంకరించారు. రంగు రంగుల పూలను సేకరించి బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడుతూ కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అమరవేని, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మహిళా అధ్యాపకులు, మహిళ క్లబ్ ఇంచార్జ్ గుగులోతు కవిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే. కవిత, కళాశాల అధ్యాపకులు, బోధ నేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.