గుర్రంపోడు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:52
 Grand Bathukamma celebrations at Gurrampodu MPDO office.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి)./...గుర్రంపోడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మండలంలోని ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు,ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది బతుకమ్మ వేడుకలను ఘనంగా  నిర్వహించారు.ఈ సందర్భంగా మంచికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు తెలంగాణలోని ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు.అనంతరం అత్యుత్తమ బతుకమ్మలు పేర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానయ్య,ఏపీఎం మైశేశ్వర్ రావు,మండల తెరాస అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు,స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, ఉపసర్పంచ్ పగిళ్ల లాలయ్య, మండల తెరాస ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొంగరాల శ్రీను,తెరాటి గూడెం సర్పంచ్ జక్కుల భాస్కర్, చామలేడు తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పగిళ్ల రమేష్,ఐకేపీ సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.