గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ భూములు ఇచ్చే అధికారం లేదు-ఎంపిఓ హెబ్సీభ రాణి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 19:11
Gram panchayats do not have authority to give government lands - MPO Hebsibha Rani

తాడ్వాయి(ప్రజాజ్యోతి): మండలము లోని గ్రామపంచాయితీలకు తీర్మానాలు ద్వారా  ప్రభుత్వభూములు ఇచ్చే అధికారం లేదని ఎంపిఓ రాణి అన్నారు.గత కొంత కాలంగా చాలా గ్రామాల్లో ఈ విషయం పై  గందగోళం నెలకొన్న నేపద్యంలో ప్రజాజ్యోతి ఎంపి ఓ రాణిని వివరాలు కోరగా  ఇలా అన్నారు.మండలంలోని ఏ ఒక్క గ్రామపంచాయితీలకు తీర్మానాలు ద్వారా గాని,సర్పంచులు రాసి ఇచ్చే కాగితాల ద్వారా గాని ప్రభుత్వ భూముల ఇచ్చే అధికారం  గ్రామ పంచాయతీలకి లేదని అలాగే తీసుకొనే అధికారం ప్రజలకు కూడా లేదని అన్నారు.ఎవరైనా పంచాయితీ తీర్మాణాలా ద్వారాప్రభుత్వ భూమిని పొంది ఉంటే అవి చెల్లవని,అది చట్టరీత్యా నేరము అని అన్నారు..అలాంటివి ఏవైనా జరిగివుంటే తమ దృష్టికి తీసుకొని రావాలని ప్రజలను కోరారు. ప్రజలు ఎవరన్నా చెప్పే వదంతులు నమ్మి  మోసపోవద్దని హితవు పలికారు.ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా ఆరోపణలు వస్తున్నాయని ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక పంచాయితీ సెక్రెటరీలను సంప్రదించాలని తెలిపారు.త్వరలో ప్రతి గ్రామపంచాయతీ నోటీస్ బోర్డులో "గ్రామపంచాయతీకి ప్రభుత్వ భూములు ఇచ్చే అధికారం లేదనే విషయాన్ని  రాసి పెట్టడానికి పై అధికారులతో చర్చిస్తామని అన్నారు.