బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:24
The government's mission is the development of the underprivileged

అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే కేసీఆర్ లక్ష్యం

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

అచ్చంపేట సెప్టెంబర్ 27. ప్రజా జ్యోతి.బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్పు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. మంగళవారం బల్మూర్ మండలంలోని మైలారం చెరువులో ఆయన చేప పిల్లలను వదిలారు అనంతరం మండల కేంద్రమైన బల్మూర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఎనిమిది సంవత్సరాల లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు అభివృద్ధి పనులు చూసి దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలని ఉద్దేశంతో కేసీఆర్ ముందుకు పోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇందులో భాగంగానే వృద్ధులకు ఆసరా పింఛన్లు రైతులకు రైతు బీమా రైతుబంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తదితర పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అదే విధంగా ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ఉమామహేశ్వర చెన్నకేశవ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన చేతుల మీదుగా ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు పార్టీలకు కులాలకు అతీతంగా ప్రభుత్వం ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ప్రజాసేవ చేసేందుకే రాజకీయంలోకి తాను వచ్చానని మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవకే అంకితం అవుతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పేర్కొన్నారు .

రైతులకు గిట్టుబాటు ధర రుణమాఫీ 24 గంటల ఉచిత విద్యుత్తు అందించిన ఘనత కెసిఆర్కే దక్కిందన్నారు తెలంగాణలో చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాలే తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాలని ఇతర రాష్ట్రాల వారు కూడా ఆయన్ని ఆహ్వానిస్తున్నారని గువ్వల బాలరాజు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛన్లు నెలకు 200 ఇచ్చేవారని ప్రస్తుతం కేసీఆర్ సారథ్యంలో 2016 రూపాయలు వృద్ధులకు 3016 లు వికలాంగులకు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ నరసింహారావు సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య యాదవ్ మండల ఉపాధ్యక్షులు నారాయణ తహసిల్దార్ క్రిస్టియా నాయక్ సర్పంచులు శ్రీనివాసులు శివశంకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపాల్ నాయక్ మాజీ మండల అధ్యక్షులు కర్ణాకర్ రావు నాయకులు చుక్కారెడ్డి సుదర్శన్ రావు మాజీ సర్పంచ్ రామచంద్రం. వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్.చేపలు వదులుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే.