పోడు భూముల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:32
 Government's aim is to solve the problem of waste land.
  • పోటో రైట్ ప్;1) సమీక్ష సమావేశం లో మాట్లాడు తున్న 
  • రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
  • 2) విద్యార్ధుల తో కలసి భోజనం చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 
  • పోడు భూముల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..
  • రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..


ఆసిఫాబాద్,సెప్టెంబర్,22,(ప్రజా జ్యోతి)\\\.../  గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పోడు భూముల సమస్య పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన పోడు భూముల వివాదాల పరిష్కారం సర్వే తోపాటు దళిత బంధు ఆసరా పెన్షన్ లపై సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా అటవీశాఖ కార్యాలయంలో అటవీ అధికారులతో మాట్లాడి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు మంత్రికి నాయకులు అధికారులు తన స్వాగతం పలికారు. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పోడు భూముల పరిష్కారం కోసం 140 జీవోను జారీ చేసిందని దీని కనుగుణంగా అటవీ రెవెన్యూ పోలీస్ అధికారులతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేసే సర్వే పూర్తి చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో వెంటనే సర్వే నిర్వహించి వివాదాస్పదంగా ఉన్న భూములకు సంబంధించి అటవీ శాఖ కార్యదర్శి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత ఒక ఇంచు అటవీ భూమి కూడా ఆక్రమించుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. దళిత బంధు పథకం కింద ఇప్పటికే జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 177 మందికి అందజేశామని నియోజకవర్గానికి మరో 500 మందిని గుర్తించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందజేయాలని దీనికోసం నూతనంగా 13476 మందిని గుర్తించి వారికి ఆసరా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అనర్హులను గుర్తించి పెన్షన్ నుండి తీసివేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో పోడు భూములకు సంబంధించి 653 హబిటేషన్స్ లో 15వేల గిరిజనులు 16 వేల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో అటవీ శాఖ అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు, రెవెన్యూ సిబ్బందితో శనివారం రోజు సర్వేకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే పారదర్శకంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో తీసుకున్న దరఖాస్తుల్లో దరఖాస్తుదారులు మోకాపై ఉన్న భూమి దరఖాస్తుల్లో అందాజాగా తెలిపారని, దానిని పూర్తి స్థాయిలో సర్వే చేయాలన్నారు. గిరిజన గిరిజనేతరుల దరఖాస్తులు మోకాపై సర్వే చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని తెలిపారు. అటవీ రెవెన్యూ సరిహద్దుల వివాదం ఉన్న భూమి 70000 ఎకరాలు ఉందన్నారు. ఐ టి డి ఏ పి ఓ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పట్టాలు పొందిన వారు కూడా దరఖాస్తు చేశారని అటువంటి వారిని గుర్తించి తొలగించాలన్నారు. దీనికోసం ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ అటవీ భూముల్లో స్మశాన వాటికలు ఉన్నచోట అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని అలా చేయకుండా చూడాలన్నారు. ఆసిఫాబాద్ సిర్పూర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలు మాట్లాడుతూ మొదట రెవెన్యూ అటవీ భూముల సరిహద్దుల వివాదాలు తొలగిన తర్వాత సర్వే మొదలు పెట్టాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పేయి, రాజేశం, డిఆర్ఓ సురేష్, ఎస్పి సురేష్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


-గిరిజన గురుకులం ఆకస్మిక తనిఖీ..

జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్య భోజనం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

నూతన కలెక్టరేట్ పనుల పరిశీలన

జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులు పరిశీలించారు. కలెక్టరేట్ లో కలియతిరిగి గదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ చివరి నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. నవంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు..