రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 12:50
Government's aim is to help farmers grow economically

డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి, సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి);  రైతులు ఆర్థికంగా ఎదుగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ మరియు పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు తెలిపారు. తుంగతుర్తి లో రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘం ఆదాయవ్యయాలను చైర్మన్ ఆధ్వర్యంలో సొసైటీ సీఈఓ సభ్యులకు చదివి వినిపించారు.ఈ సందర్భంగా చైర్మన్ గుడిపాటి సైదులు మాట్లాడుతూ... 2021- 2022 సంవత్సరానికి గాను13 కోట్ల టర్నోవర్ తో నడుస్తుందని తెలియజేశారు. వానకాలం సీజన్లో రైతులకు  సొసైటీ పరిధిలో 60 లారీల ఎరువులను అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ వానకాలం సీజన్ లో రైతులకు వ్యవసాయ రుణాలు 55 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలకు సకాలంలో వడ్డీలు చెల్లించి ప్రభుత్వం అందించే మూడు శాతం రిబేటు ను పొంది, సొసైటీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

అనంతరం వార్షిక బడ్జెట్ అంచనాలతో పాటు పలు ప్రతిపాదనలు సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు యాదగిరి, రామచంద్రు, మల్లయ్య, మాజీధ్, భిక్షం రెడ్డి, రామనరసమ్మ, ఈదప్ప, పూలమ్మ, యాకయ్య, రవీందర్ రెడ్డి, చాంప్ల, బ్యాంకు మేనేజర్ యాదగిరి, సొసైటీ సిబ్బంది యాదగిరి, మహేష్, ఉమేష్, తోపాటు సొసైటీ పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.