జీజీహెచ్ సూపరింటెండెంట్ పై కలెక్టర్ కు ఫిర్యాదు... చర్యలు తీసుకోవాలని వినతి...

Submitted by SANJEEVAIAH on Thu, 20/04/2023 - 17:55
Photo

జిజిహెచ్ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కు ఫిర్యాదు

(నిజామాబాద్ - ప్రజాజ్యోతి - మహేష్ రెడ్డి)

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ( జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ను ను గ్రామస్తులు కోరారు. గురువారం నవీపేట్ గ్రామ ప్రజలు కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ పేద ప్రజలకు సక్రమమైన వైద్యం అందించాలని సదుద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్నో కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబోతుల సాయికుమార్ కు బుధవారం నవీపేట్ రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగిందని అక్కడి నుండి వెంటనే (జీజీహెచ్) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, అక్కడ పర్యవేక్షణ అధికారికి ప్రజా ప్రతినిధులు ఫోన్ చేసినప్పటికీ ఏమాత్రం పర్యవేక్షణ అధికారి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో సుమారు రెండు గంటల పాటు ఆసుపత్రిలోనే వేచి చూసి, గాయపడిన సాయికుమార్ కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరిగిందని అన్నారు‌. ఇది ఇలా ఉండగా గత వారంలోని సోషల్ మీడియాలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించక పేషెంట్ కు సంబంధించిన అటెండర్లు కాళ్లు పట్టి లాక్కెళ్తున్న సంఘటన సోషల్ మీడియా లో వైరల్ కావడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ పర్యవేక్షణ అధికారి నుంచి ఎటువంటి చలనం లేదని, దీనిపైన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు విచారణ చేపట్టుటకు సిబ్బందిని పంపించినప్పటికీ ఎటువంటి మార్పు లేదని, కనీసం జిల్లా కలెక్టర్ అయినా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పర్యవేక్షణ చేసి విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ గ్రామస్తులు పాల్గొన్నారు.