కనీస వేతనం అమలు కోసం దశల వారి ఆందోళనకు సిద్ధం కండి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:13
Get ready for their agitation on the steps for implementation of minimum wage

తొర్రూరు అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి/... ) రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు 128 మున్సిపాలిటీలలో సుమారు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారి కనీస వేతనం 26,000  దశల వారి ఆందోళనకు సిద్ధం కావాలని భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్టియు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. నేడు తొర్రూరులోని మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.అర్వపల్లి వెంకన్నఅధ్యక్షత వహించగా రవి మాట్లాడుతూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న పక్క రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు నెలకు 21000 వేతనం ఇస్తుంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో 15,400 మాత్రమే ఇవ్వటం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి కరోనా లాంటి భయంకరమైన వ్యాధులతో పోరాడుతూ పట్టణాలలో ఉన్న ప్రజలకు సేవ చేశారని కెసిఆర్ పొగడ్తలతో కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. మరోవైపు ప్రధాని మోడీ మున్సిపల్ కార్మికుల దేవుళ్ళు అని మాటలతో కార్మికుల కడుపులు నిండవని వారికి నిజ వేతనాలు పెరిగినప్పుడు మాత్రమే ఆనందం సంతోషం ఉంటుందని అన్నారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి అందరినీ పర్మినెంట్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ బుట్ట దాఖలు అయిందని అన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 12 సంవత్సరాల క్రితం తీర్పునిచ్చిన నేటికీ అమలు కాకపోవటం కోర్టు తీర్పుల పట్ల కార్మికుల పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందని ఎద్దేవా చేశారు.

11వ పిఆర్సి లో 19వేలపైన 33% ఫిట్మెంట్ ఇవ్వాలంటే 12000 పైన 30% ఫిట్మెంట్ మున్సిపల్ కార్మికులకు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు మున్సిపల్ స్థాయి నుండి సి డి ఎం ఏ మున్సిపల్ శాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రి కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిర్వహించనున్న దశల వారి ఆందోళనలో ప్రతీ కార్మికుడు పాల్గొనాలని రవి పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న మాట్లాడుతూ మనుషులు ఎవ్వరూ చేయని పనిని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రతినెల ఐదు లోపు జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అందరికీ కల్పించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఎం యాకయ్య నరసింహ శేఖర్ సోమయ్య వెంకన్న వెంకటమ్మ లక్ష్మి ఎల్లమ్మ సుశీల తదితరులు పాల్గొన్నారు....