మద్వార్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:39
Ganesh Immersion in Madwar
  • భక్తిశ్రద్ధలతో, భజనలతో విగ్రహాల తరలింపు
  • స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం పాటలో పోటా పోటీ

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఆ దేవదేవుడైన విగ్నేశ్వరుని ఐదు రోజుల పాటు గ్రామస్తులు వీధి వీధిలో ప్రతిష్టించిన స్వామిని భక్తితో భజనతో నైవేద్యాన్ని సమర్పించి కొలిచారు. అనంతరం స్వామి వారిని నిమజ్జనానికి తరలిస్తున్న సందర్భంలో గణేష్ ల ముందు భక్తి పాటలతో భజనలతో స్వామి వారిని కొలుస్తూ నిమజ్జనం చేశారు.

లడ్డు వేలం పాటలో పోటాపోటీ

మహాద్వార్లో ప్రతిష్టించిన వినాయకుల వద్దా ఉంచిన లడ్డూలకు గ్రామస్తులు పంచుకోవడానికి పోటా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో భాగంగ శ్రీ ఆంజనేయ స్వామి గుడిదగ్గర లడ్డు వేలంలో రూ. 13500 పాట పాడగా, సేపండు రూ. 1500లకు దక్కించుకున్నారు. అలాగే ఇదేమ్మ గుడిదగ్గర ఉన్న గణేష్ దగ్గర ఉంచిన లడ్డురూ. 18500లకు, సేపండు రూ. 1500 లకు భక్తులు దక్కించుకున్నారు.  భూమి లక్ష్మమ్మ అమ్మవారి గుడి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర లడ్డు రూ. 4000 భక్తులు దక్కించుకున్నారు. గడ్డమీద మంటపం లోనీ లడ్డును రూ .19500 వేలం లో పాడగా సేపండు రూ.4000లకు భక్తులు దర్శించుకున్నారు.