రాచకొండ గిరిజన తండాలలో గండ్ర సత్యనారాయణ

Submitted by veeresham siliveru on Sun, 04/09/2022 - 16:36
Gandra Satyanarayana among the Rachakonda Tribal Tandas
  • రాచకొండ గిరిజనులకు అండగా కాంగ్రెస్- 
  • మాజీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 4, ప్రజా జ్యోతి: రాచకొండ గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ భూమి పట్టాలు ఇవ్వగా కెసిఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పట్టాలను రద్దు చేసిందని ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంస్థాన్ నారాయణపూర్ మండల ఇన్చార్జి గండ గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. మన కాంగ్రెస్ మన మునుగోడు కార్యక్రమం ఆదివారం నాడు రాచకొండలోని నాలుగు గిరిజన తండాలలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గిరిజన తండాలలో పర్యటించి ఇంటింటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ భూముల సమస్యలను గండ్ర సత్యనారాయణకు వివరించారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన భూపట్టాల పాసుబుక్కులను చూపించారు. దీనికి స్పందించిన గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ తరతరాలుగా రాచకొండ నమ్ముకొని వేలాది మంది గిరిజనులు జీవిస్తున్నారని తెలిపారు. ఇక్కడ భూములను సేద్యం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనులకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పట్టాలు  ఇచ్చిందని తెలిపారు .

తరతరాలుగా ఇక్కడి భూములను సేద్యం చేసుకుంటూ గిరిజనులు జీవిస్తున్నారని తెలిపారు రాచకొండ భూములను ఆసరాగా చేసుకుని గిరిజనులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల బడుగు బలహీన వర్గాల ప్రజలు సేద్యం చేసుకుంటున్నారని తెలిపారు.  వీరు సేద్యం చేసుకుంటున్నా భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలి ఇచ్చి హక్కులను కల్పించిందని వివరించారు.  గిరిజన రైతులు ఈ భూములపై పంట రుణాలు తీసుకొని సేద్యం చేసుకుంటున్నారని తెలిపారు. అలాంటి గిరిజనులకు ధరణి పేరుతో కెసిఆర్ ప్రభుత్వం సెటగోపం పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలను ఓడిస్తేనే బడుగు బలహీన వర్గాలకు రక్షణ ఉంటుందన్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన అన్నారు. ఇందులో ధరణి చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది తెలిపారు. త్వరలో మునుగోడులో జరగబోయే ఉప ఎన్నికల్లో, ఆ తరువాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి , చల్లమల్ల నర్సింహారెడ్డి, రాస మల్ల యాదయ్య , మందు గుల బాలకృష్ణ, చిలువేరు నరసింహ, వార్డు మెంబర్ యాదయ్య, గోపాల్ , గిరిజనులు పాల్గొన్నారు.