ముగిసిన గణపతి నవరాత్రి వేడుకలు ఉత్సాహంగా ఉట్టి ఉత్సవాలు

Submitted by bosusambashivaraju on Sun, 11/09/2022 - 16:19
 Ganapati Navratri celebrations are over Festivals with enthusiasm

ఉత్సాహంగా ఉట్టి ఉత్సవాలు
రూ.9వేలకు లడ్డు వేలం దక్కించుకున్న పడిదం సునీల్

నర్సంపేట చెన్నారావుపేట సెప్టెంబర్ 11( ప్రజా జ్యోతి): చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చెడ గ్రామంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టుడు కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం లడ్డు వేలం లో గ్రామానికి చెందిన పడుదం సునీల్ దక్కించుకోగా, పులిశేరు ఆధ్యా లడ్డు డ్రా కైవసం చేసుకుంది.. అనంతరం నిమజ్జనానికి తరలిన గణనాధుడికి ఆధ్యాంతం మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించారు. మహిళల కోలాటాలు, యువకుల నృత్యాల నడుమ గణపతి ని గంగమ్మ ఒడికి తరలించారు.. ఈ కార్యక్రమంలో  ఉత్సవ కమిటీ బాద్యులు పులిశేరు రాజేందర్, ఒంటరి అశోక్, పెండ్యాల నగేష్,పడిదం అనిల్,పడిదం రాకేశ్, పడిదం హరికృష్ణ, పడిదం సునీల్,  తూటి వినయ్, పెండ్యాల త్రినేష్, ముత్యం రాహుల్, ముత్యం పండు, కునమళ్ల సాయిదీప్, పడిదం విక్రాంత్,  బొనగిరి ప్రశాంత్, కొత్త శ్రీకాంత్, అఖిల్, మహిళలు ఒంటరి అనిత, పెండ్యాల మోనిక, జ్యోతి,   వసంత, కొత్త వినోద, విజయ, సరోజన, సుప్రియ, రాధ, హేమలత, కరుణ, పెండ్యాల రజిత, తులసి, తదితరులు పాల్గొన్నారు.