"రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ భేటి"

Submitted by Kramakanthreddy on Thu, 29/09/2022 - 11:19
 "Former legislators Sampath Kumar met with Chief Secretary Somesh Kumar"

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించి  పరిష్కరించమని మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ  ఎర్రవల్లి నూతన మండల ఏర్పాటుపై 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ  మొన్న ప్రకటించిన కొత్త మండలాల జాబితాలో ఎర్రవల్లి నూతన మండలం లేకపోవడం విచారకరమని ఇదే విషయాన్ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి  భౌగోళికంగా పరిపాలన పరంగా కూడా ఎర్రవల్లి నూతన మండల ఆవశ్యకతను   వివరించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. నిధుల కొరత వల్ల వంద పడకల ఆసుపత్రి పనులు మందకోడిగా  సాగుతున్న విషయాన్ని విన్నవించడం జరిగిందని, అల్లంపూర్ లో డిగ్రీ కాలేజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు కాకపోవడం పై వివరించడం జరిగిందని ఆయన అన్నారు.

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  ప్రతిపాదించిన మినీ బస్సు డిపో అమలుకు నోచుకోకపోవడం విచారకరమని, తుమ్మిళ్ల లిఫ్ట్ రెండో దశ పనులు మల్లమ్మ కుంట, జులకల్, వల్లూరు రిజర్వాయర్లను వెంటనే పనులు చేపట్టాలని సోమేశ్ కుమార్ ని విజ్ఞప్తి చేయడం జరిగిందని, జోగులాంబ అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు 100 కోట్లు కేటాయిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదన్న విషయాన్ని గుర్తు చేయడం జరిగిందని అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గం లోని మూడు మున్సిపాలిటీలలో ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ లో జరుగుతున్న
అవినీతి అక్రమాలపై వివరించడం జరిగిందనిపైన ప్రస్తావించిన అన్నియు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలేలని గుర్తు  చేయడం జరిగిందని అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి సర్పంచ్ రవి, అలంపూర్ మండల అధ్యక్షుడు రాము, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.