బతుకమ్మ విగ్రహా అభివృద్ధి పనులను అడ్డుకున్న పారెస్టు అధికారులు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:28
 The forest officials blocked the development work of Bathukamma statue.

ఎలాగైనా కట్టి తీరుతాము కాంగ్రెస్ పార్టీ నాయకులు .

కొత్తగూడ సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి)'',, కొద్ది రోజుల్లో జరగబోయే  తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ సంబరాల పర్వదినంను పురస్కరించుకుని వజ్జ వెంకటలక్ష్మీ- సురేందర్ గ్రామ సర్పంచ్ అద్వర్యంలో బతుకమ్మ ఆటలు ఆడే చెరువు కట్ట మీద బతుకమ్మ విగ్రహం ఆవిష్కరణ చేసే కార్యక్రమంలో అభివృద్ధి పనులను అడ్డుకున్న కొత్తగూడ పారెస్టు అధికారులు, తిరగపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో  ఉల్లేన్గుల రమేష్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతు వేలుబెల్లిలో జరగబోయే ఎంగిలి పూల బతుకమ్మ మా గ్రామ ఆడపడుచులు జరుపుకునే సంబరాలు చెరువు కట్ట మీద గ్రామ సర్పంచ్ వజ్జ వెంకటలక్ష్మీ సురేందర్ అద్వర్యంలో బతుకమ్మ విగ్రహా అభివృద్ధి పనులను  పారెస్టు అధికారులు అడ్డుకోవడం సిగ్గు చేటు  ఎలాగైనా అభివృద్ధి పనులు చేసి తీరుతాము అని రమేష్ వాపోయారు. 

 ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉల్లెంగుల సురేష్ , వజ్జ రమేష్ మాజీ మార్కెట్ డైరెక్టర్, పాషా మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,వార్డు మెంబెర్ కాట వెంకన్న , పసునూరి ప్రసాద్ , రౌతు గూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంబోతు శంకర్  కొంకటి మల్లారెడ్డి , మురళి , అనిల్ ,లంక అశోక్ ,సతీష్, మోకాళ్ళ చైతన్య, తిరుమలేష్ , పెండ్యాల రాజు, సంకపల్లి సతీష్,  కుమ్మరి గుడి సునీల్,  మురారి ,రవి కుమార్, నిరసన వ్యక్తం చేశారు.