వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం..

Submitted by shaikmohammadrafi on Thu, 29/09/2022 - 13:57
 The establishment of medical camps is commendable.

గ్రామీణ ప్రాంత  ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం.

 ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..

నడిగూడెం ,సెప్టెంబర్ 28, ప్రజా జ్యోతి: గ్రామాల్లో ఉచిత వైద్య శిభీరాలు  ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవలు అందించటం  అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నడిగూడెం మండలంలోని ఎక్లాస్ ఖాన్  పేట  గ్రామంలో  గ్రామ పెద్దలు
దేవబత్తిని సురేష్ బాబు,దేవబత్తిని  రమేష్ బాబు ల సౌజన్యంతో సీయోను ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో బుధవారం  ఏర్పాటు చేసిన హ్యాండ్ ఆఫ్ హోప్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే  నిధుల నుండి  ఏడు లక్షల రూపాయల  వ్యయంతో చర్చి ప్రహరీ  గోడ నిర్మాణమును ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుండి చదువుకున్న  యువకుడు ఉన్నత ఉద్యోగం లో ఉండి జన్మభూమి పై మమకారంతో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.  గ్రామాల్లోని పేద ప్రజలకు అందని ద్రాక్ష గా ఉన్న కార్పొరేట్ వైద్యాన్ని సీఐ శేఖర్  పేద ప్రజలకు అందించేందుకు కృషి చేయటం  అభినందనీయమన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా లక్షల రూపాయలు వైద్య చికిత్సలకు  అందిస్తూ పేదల ప్రాణాలు కు అండగా నిలబడింది అన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ప్రభుత్వం నుండి తోడ్పాటును  అందిస్తుందన్నారు. గ్రామానికి చెందిన శేఖర్ ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు..

ఈ సందర్భంగా అన్ని రకాలకు సబందించిన   వైద్య పరీక్షలు ఉచితంగా నిర్యహించారు.సుమారు  ఏడు లక్షల విలువ  గల  మందులను పంపిణీ చేశారు. అవసరం  అయినవారికి  కండ్ల  జోడులను పంపిణి  చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ  ఎంపీపీ  యాతాకుల జ్యోతి మధుబాబు, సొసైటీ చైర్మన్ పుట్ట రమేష్, సర్పంచి దొడ్డి మానస నర్సింహా రావు,సర్పంచుల పోరం అధ్యక్షులు  దేవబత్తిని వెంకట నరసయ్య, టిఆర్ఎస్ నాయకులు అనంతుల ఆంజనేయులు, బాణాల నాగరాజు, లాల్ మొహమ్మద్, నల్లమాద నారాయణరావు,పాటకోట్ల నాగేశ్వరరావు, ఇమ్మడి వెంకన్న, ప్రవీణ్ కుమార్, చాకిరాల సర్పంచ్ వీరాస్వామి, కోటిరెడ్డి, కొల్లు వీరయ్య, ప్రముఖ డాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు...