మద్దిరాల మండల నూతన ఆర్యవైశ్య మండల కమిటీ ఎన్నిక

Submitted by Sathish Kammampati on Mon, 05/09/2022 - 11:23
 Election of new Arya Vaishya Mandal Committee of Maddirala Mandal

మద్దిరాల మండలంసెప్టెంబర్ 4 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండల కేంద్రంలో ఆదివారం రోజు ఆర్యవైశ్య మండల కమిటీని జిల్లా అధ్యక్షుడు మాశేట్టి అనంతరాములు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. మద్దిరాల మండల ఆర్యవైశ్య అధ్యక్షునిగా బ్రహ్మదేవర శ్రీనివాసు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహంకాళి వెంకటేశ్వర్లు  మా ఎన్నిక సహకరించిన మండల ఆర్యవైశ్య సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బండారి రాజా జిల్లా సహాయ కార్యదర్శి మహంకాళి సోమయ్య బ్రహ్మదేవర బిక్షమయ్య మాడుగుల శంకర్, వీరి సమక్షంలో నూతనంగా  ఎన్నికైన ఉపాధ్యక్షులు తోట సురేష్ ప్రధాన కార్యదర్శి గుమ్మడవెల్లి బిక్షమయ్య, కోశాధికారి వంగపల్లి వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షులు రాజేష్, కార్యదర్శి మహంకాళి అజయ్, మండలంలోని వివిధ గ్రామాల ఆర్యవైశ్య సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కమిటీని విజయవంతం చేయడం జరిగినది