కేసీఆర్, గాదరి కిషోర్ దిష్టిబొమ్మ దహనం

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 11:57
 Effigies of KCR and Gadari Kishore were burnt
  • ఆర్ ఎస్ పి పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి
  •  ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
  •  నకిరేకల్ నియోజకవర్గ బిఎస్పి ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని 

నల్లగొండ అక్టోబర్ 01(ప్రజాజ్యోతి) తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్  బి ఎస్ పి అధ్యక్షులు ఆర్ఎస్పీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.అనంతరం మాట్లాడుతూ ముందుగా వారు చేసిన ఆరోపణలు చూద్దాం దళితులంతా కేసీఆర్ వైపు ఉన్నారు. అన్నావు.వాళ్లు ఎలాగో ప్రతిపక్ష మతతత్వ బిజెపిలోకి రారు కాబట్టి ఉద్యోగిగా చేసిన అక్రమాలు అన్ని బయటకు తీస్తామని బెదిరిస్తే సూట్ కేసులు తీసుకొని దళితుల ఓట్లు చీల్చడానికి వచ్చాడని అంటున్నావు? అని ప్రశ్నించారు. ముందుగా ఆర్ఎస్పీ చరిత్ర తెలుసుకో! వారితో పనిచేసిన పోలీస్ అధికారులతో మాట్లాడు తను మూటలు తీసుకునేవాడా తన జాతికి మూటలు ఇచ్చేవాడా తెలుస్తది.200 మంది దళితులను ఎన్కౌంటర్ చేసిండు అంటున్నావ్ నాటి ఆంధ్రప్రదేశ్లో నక్సలిజంని నిర్మూలించి ఉద్యమకారులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆర్ఎస్పి  చేసిన కృషి వారి కంటే ముందుగానీ భవిష్యత్తులో గాని ఎవరు చేయరు. నాటి ప్రభుత్వాల్లో ఎందరో  ఐపిఎస్ లు పనిచేశారు.వారందరి హయాంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి.అవి మాత్రం ప్రభుత్వం చేసినది కానీ ఆర్ఎస్పీ  ఎస్పీగా ఉన్నప్పుడు చేసినవి మాత్రం కావాలని చేసినవా.?  మాట్లాడేటప్పుడు కనీస విజ్ఞత ఉండాలి అని ఎద్దేవా చేశారు.నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు నేడు నిన్ను రక్షిస్తున్న పోలీసులను తయారు చేసే పోలీస్ అకాడమీలో పాఠాలు వీలైతే వెళ్లి విను అని హితబోధ చేశారు.2001లో మీ నాయకుడు కేసీఆర్, పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎజెండాలోని ప్రధానమైన మాట దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే మెడ నరుక్కుంటా ఇది జరిగిందా? అని ప్రశ్నించారు.

తుపాకీ బాటలో పోయిన బిడ్డలను ఆర్ఎస్పీ జనజీవన స్రవంతిలోకి తెస్తే వారి కష్టాన్ని పోరాటాన్ని తెలివిగా వాడుకోవడానికి కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దాంతో వారంతా మీతో ఉద్యమంలో కలిసి వచ్చారు చివరకు వాళ్లను నిలువునా మోసం చేసిండు. లెక్కలు తీద్దాం దళితుల కోసం కేసీఆర్ పెట్టిన ఏ పథకంతో వాళ్ళు కోటీశ్వరులైనరో దళితులకు ఆయన చేసిన ఏ మంచి పని వల్ల వాళ్ల జీవితాల్లో మార్పు వచ్చిందో 2004లో మీకు అదే నక్సలైట్లు ఉద్యమకారులు సపోర్ట్ చేసినారు కాబట్టే రాజకీయాలు చేయగలిగారు చివరకు వారందరినీ మోసం చేసింది కేసీఆర్ దమ్ముంటే దీని గురించి మాట్లాడు కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తే భయపడడానికి ఆర్ఎస్పి పిల్లి కాదు పులి ఒక్కసారి వారి పోలీసింగ్ ఎలా ఉండేదో తెలుసుకో ఇంకోసారి ఆర్ఎస్పీ పైన అవాకులు చవాకులు మానుకోవాలి. కేసీఆర్ దళిత బంధు ఆర్ఎస్పీ రాజకీయాల్లోకి వస్తాడని తెలిసే మొదలుపెట్టాడు మిత్రమా! ఆర్ఎస్పీ దళిత బంధు తర్వాత రాజకీయాల్లోకి రాలేదు. సరే లెక్కలు తీద్దాం సిద్ధమా ? మీరు ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో, వారితో ఎంతమంది ప్రయోజకులైనరో? అసలు డబ్బంతా ఎటు నుంచి ఎటు పోతుందో అన్ని ఒకసారి లెక్కలు తీయడానికి సిద్ధమా? వందలాదిమంది దళితులు తుపాకీ బాటవీడినరు కాబట్టే ఈనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇలా ఉన్నాయి. అందుకు మీ ప్రభుత్వం ఆర్ఎస్పీ లాంటి ఎందరో ఆఫీసర్లకు రుణపడి ఉండాలి.

నీ నియోజకవర్గంలో దళితుల స్థితిగతుల పైన శ్వేత పత్రం విడుదల చేయడానికి సిద్ధమ? అని ప్రశ్నించారు.ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వేల కోట్ల రూపాయలు మీ జేబుల్లోకి వెళ్తున్నది నిజం కాదా....? ఇదే కదా ఇసుక మాఫియా కేటీఆర్ సిరిసిల్లలో దళిత యువకులు ఇసుక మాఫియా అని ప్రశ్నించినందుకు వాళ్లను శారీరకంగా చిత్రహింసలు పెట్టి లేవ లేకుండా చేసింది నిజం కాదా? తెలంగాణ ఉద్యమకారులకు ఆర్ఎస్పీ ఏం చేసిందో తెలుసు నీ చిల్లర మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు.ఇకనైనా మాటలు అదుపులో పెట్టుకో లేకపోతే నీకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజీత్,నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాధగోని రవీందర్ గౌడ్,రామన్నపేట  మండల అధ్యక్షులు మేడి సంతోష్,  ప్రధాన కార్యదర్శి గుని రాజు,నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్,నాయకులు చేరుకుపల్లి శాంతి కుమార్, మునుగొడు సత్తయ్య, కత్తులు దాస్ మేడి కృష్ణ, తదితరులు పాల్గోన్నారు.