తెలంగాణ గురుకులాల విద్యా విధానం దేశానికే ఆదర్శం : ఎమ్మేల్యే సండ్ర

Submitted by Satyanarayana on Wed, 28/09/2022 - 10:00

 

తెలంగాణ గురుకులాల విద్యా విధానం దేశానికే ఆదర్శం : ఎమ్మేల్యే సండ్ర

 

8వ జోనల్ స్థాయి క్రీడా విజేతలకు బహుమతులు అందజేత

 

 సీఎం కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ని అధిరోహించి భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటారు

కల్లూరు, సెప్టెంబర్ 27ప్రజాజ్యోతి:

తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం అని ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు గురుకులంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 8వ జోనల్ స్థాయి క్రీడలు ముగింపు సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవం లో ఎమ్మేల్యే సండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీడలు మానిసిక ఉల్లసంతో పాటు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో గురుకుల విద్యా విధానం, కార్పొరేట్ విద్యావిధానాలకు దీటుగా ఉంటూ మెరుగైన ఫలితాలను అందిపుచ్చుకుంటుందని అన్నారు. గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ లు ఈనాడు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించి దేశానికి కీర్తి ప్రతిష్టలను సముపార్జించారని అన్నారు. అలాగే డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా అనేక రంగాల్లో అగ్రభాగాన గురుకుల విద్యార్థులు ఉన్నారని అది మన తెలంగాణ ప్రభుత్వానికి గర్వకారణమని అన్నారు. తెలంగాణ గురుకులాల్లో ఎంతో ఉన్నత ప్రమాణాలతో విద్యా, ఆరోగ్యం అందిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ఒక్కో విద్యార్థి సంవత్సరానికి రూ.లక్ష 25 వేలకు పైగా కేటాయిస్తుందని, గత వసతి గృహాల పరిస్థితికి, ఈనాటి గురుకులాల పరిస్థితికి పొంతనలేని విధంగా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇలాంటి సదవకాశాలను విద్యార్థులు వినియోగించుకొని తల్లిదండ్రులు కన్న కలలతో పాటు, ఉపాధ్యాయులకు చదువుకున్న విద్యాలయాలకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాంక్షించారు. జోనల్ క్రీడలతో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాలికలు ఒకరికొకరు స్నేహ భావాన్ని పెంపొందించుకోవడానికి సమైక్యతను చాటడానికి మానసిక పరిపక్వత ,విజ్ఞానం పెపొందడానికి ఈ క్రీడలు దోహదపడతాయని అన్నారు. క్రీడా స్ఫూర్తితో జీవితాన్ని కూడా జయించాలని అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 8వ జోనల్ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విజేతలతోపాటు, గెలుపు కోసం పోరాడిన వారు కూడా మరింత ఉత్సాహంతో మరో విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి రఘు జడ్పిటిసి కట్టా అజయ్ కుమార్, గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీలత , ఎస్సై బి. కొండలరావు , రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు పసుమర్తి చంద్రరావు , జడ్పీ కో ఆప్షన్ ఎండి ఇస్మాయిల్, ఎఎంసి వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకోప్పు ప్రసాద్ , సర్పంచులు రావి సూర్యనారాయణ, కువ్వారపు విజయరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉబ్బన వెంకటరత్నం , నాయకులు మేకల కృష్ణ , బొగ్గుల రామిరెడ్డి, అయులూరి నాగిరెడ్డి, గోసు రమణయ్య, పైళ్ళ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.