డుమ్మా కొట్టారా..? దూరం పెట్టారా..?... ఆర్మూర్ మున్సిపాలిటీ పై సమీక్షించిన ఎమ్మేల్యే... సమీక్షకు డుమ్మా కొట్టిన చైర్ పర్సన్...

Submitted by SANJEEVAIAH on Mon, 23/01/2023 - 23:14
Photo

డుమ్మా కొట్టారా.? దూరం పెట్టారా.?

ఆర్మూర్ మున్సిపల్ అవినీతి, అక్రమాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ డుమ్మా 

నిజామాబాద్ ప్రతినిధి, ప్రజాజ్యోతి, జనవరి 23 :

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం వివాదం కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయంలో ఒకవైపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌన్సిలర్లలకి చెప్పి పంపినప్పటికీ మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పండిత్ పవన్ పై విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. "ప్రజాజ్యోతి" కి అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండున్నల్లుగా ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అవినీతి అక్రమాలపై ఆరా తీసారు. శనివారం హైదరాబాదులో ఆర్మూర్ మున్సిపల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 
అయితే ఈ సమావేశానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత గైరాజర్ అయ్యారు. అయితే ఈ విషయంలో పండిత్ వినిత వ్యక్తిగతంగానే గైరాజరయ్యారా లేక ఎమ్మెల్యేనే ఈ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ ను దూరం పెట్టారని అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధితోపాటు ఇంటి నెంబర్ల మంజూరు, ప్రభుత్వ భూములలో ఇళ్లా పట్టాలు ఇచ్చిన అంశాలపై మున్సిపల్ అధికారుల నుంచి ఎమ్మెల్యే ఆరా తీసారు. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హయాంలో ఇచ్చిన ఇంటి నెంబర్లతో పాటు ఇళ్ల స్థలాల వివరాలను కూడా సేకరించారు. అలాగే ఆ తర్వాత ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మనోహర్ హయాంలో లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇంటి నెంబర్ల వివరాలను ఆరా తీశారు. మున్సిపల్ అధికారులకు మున్సిపల్ చైర్ పర్సన్ వినీత భర్త పవన్ కు ఉన్న సంబంధాలపై పని తీరుపై కూడా కూపీ లాగారు. సమావేశంలో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను బలంగానే ప్రశ్నించి అందుకు సంబంధించిన వివరాలను రాబట్టినట్లు రాబట్టారు. 

అవిశ్వాసం తప్పదా.?

ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితపై అవిశ్వాసం తప్పదా అనే ప్రశ్న మరోసారి తలెత్తుతుంది  ఇప్పటికే సద్దుమణిగిందనుకున్న వివాదంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో మరోసారి చర్చకు కారణం అవుతుంది. మున్సిపల్ పై ఎమ్మెల్యే దృష్టి సారించడంతో మార్పు తప్పదని తెలుస్తుంది. ప్రధానంగా ఇంటి నెంబర్ల మంజూరు, ప్రభుత్వ ఇళ్ల స్థలాలలో పట్టాలు ఇవ్వడం, విశాఖ కాలనీలో జరిగిన భూ వివాదాల తంతు కాకుండా ఇతర అంశాలపై కూడా అధికారుల నుంచి ఆరా తీశారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే సైతం ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేకంగా దృష్టి సారించడంపై చైర్ పర్సన్ చైర్ ఖాళీ అవుతుందని అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.