తహసీల్దార్ కార్యాలయంలో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్యశిభిరం.

Submitted by Praneeth Kumar on Mon, 19/12/2022 - 18:57
'Doctor Care' Free Homeopathic Medical Camp at Tahsildar's Office.

తహసీల్దార్ కార్యాలయంలో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.

ఖమ్మం అర్బన్, డిసెంబర్ 19, ప్రజాజ్యోతి.

సోమవారం ఖమ్మంలోని రూరల్ మండల రెవిన్యూ కార్యాలయంలో 'డాక్టర్ కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో కార్యాలయం సిబ్బందికి, విసిటర్స్ కి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు డా రాజేష్ బాబు బిపి, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి అక్యూట్, క్రానికల్ జబ్బులకు హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. అనంతరం రూరల్ తహసీల్దార్ టి సుమ, నాయబ్ తహసీల్దార్ సిహెచ్ సురేష్ బాబు మాట్లాడుతూ ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేస్తునందుకు డాక్టర్ కేర్ సంస్థ సిఈఓ ఏఎం రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ కేర్ రీజినల్ మేనేజర్ రామ్ ప్రవీణ్ మాట్లాడుతూ సంస్థ ప్రారంభించి పదిహేను సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఇలాంటి ఉచిత క్యాంప్ లు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఇలాంటి క్యాంప్ లు సుమారు ఐదు వందల పైనే నిర్వహించామని, మున్ముందు ఇలాంటి క్యాంపులు నిర్వహించి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింత తీకువెళ్లే బాధ్యతను డాక్టర్ కేర్ సంస్థ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ పిఆర్ఓ వి స్వాతి శ్రీ, ఇతర సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.