మావోలకు సహకరించవద్దు.

Submitted by veerareddy on Wed, 14/09/2022 - 09:46
Do not cooperate with the Maoists.

కొత్తగూడ సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి) ,.మండలంలోని కర్ణగండి, దొరవారి వేంపల్లి, అదేవిధంగా గంగారం మండలంలోని కామారం, పొనుగొండ్ల, మర్రిగూడెం గ్రామాలలో సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని  సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా పోలీసు వారు అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా మావోయిస్టులకు సహకరించోద్దని వారి సహాయాన్ని కోరవద్దని వారి యొక్క సమాచారాన్ని అందించాలని అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం  జరుగుతుందని, మావోయిస్టుల పోస్టర్లలను చూపెట్టి వారి సమాచారం ఇచ్చిన ఎడల తగిన బహుమతి ఇవ్వబడునని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు కొత్తగూడ గంగారం ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొనడం జరిగినది.