కల్వర్టు నిర్మాణం చేపట్టాలి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి

Submitted by sudhakar on Sat, 01/10/2022 - 11:09
District Youth Congress leader Byreddy Sandeep Reddy should take up the construction of the culvert

అడ్డగూడూర్ సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి న్యూస్ ./...అడ్డగూడూర్ మండల కేంద్రంలో గోధుమకుంట వద్ద అడ్డగూడూరు నుండి కోటమర్తి గ్రామానికి వెళ్లే దారి మధ్యలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోధుమ కుంట నుండి అలుగు వరద నీరు ఎక్కువ రావడంతో రోడ్డు ప్రమాదకరంగా అయ్యి  ఈ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులు, రైతులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ,అడ్డగూడూరు నుండి కోటమర్తి వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కానీ పనులు ఆలస్యం కావడం చాలా దురదృష్టకరమని తెలిపారు , అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కల్వర్టు మరియు రోడ్డు నిర్మాణం చేపట్టాలని యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బుడుగుండ్ల రవి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు అలుగువెల్లి సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు