ఆడపడుచులకు సారెగా బతుకమ్మ చీరలు పంపిణీ

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 13:21
Distribution of sarees and bathukamma sarees to girls
  • తెలంగాణ సర్కారు లో మహిళలకు సముచిత గౌరవం
  • సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
  • దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శం

చిట్యాల సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి) .////  నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలో ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్, జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్,వైస్ ఎంపిపి మళ్ల అలివెలు రాంరెడ్డి లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.రాష్ట్రంలో ఆడపడుచులు అందరికీ సారెగా బతుకమ్మ చీరలు అందించడం జరుగుతోందని ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు.బుధవారం చిట్యాల మండలంలోని  గుండ్రాంపల్లి,వెలిమినేడు,వనిపాకల,వట్టిమర్తి,నెరడ,వెంబావి, ఎలికట్టె పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిపి కొలను సునీత  వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి తో కలసి మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సర్కారు లో మహిళలకు సముచిత గౌరవం దక్కిందని తెలిపారు.సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అందరు కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు.

మహిళలకు పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అందులో భాగంగా ఆడపిల్ల పెళ్లికి అందించే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు దేశంలో ఎక్కడ లేవని స్పష్టం చేశారు అలానే కేసీఆర్ కిట్టు తో పాటుగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు లాంటి ఎన్నో పథకాలు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.ఎనిమిది ఏండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి,సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు,నాయకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.