మండల వ్యాప్తంగా నూతన పింఛన్ కార్డుల పంపిణీ

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 15:15
 Distribution of new pension cards across the mandal

నూతన పింఛన్ కార్డులను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ 

తుంగతుర్తి, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి): దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని తుంగతుర్తి వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తగూడెం, కరివిరాల, సంగెం, గుడి తండా, అన్నారం, బండ రామారం, సూర్య తండా, మంచ్యతండా, తదితర గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద   మంజూరైన నూతన ఆసరా పింఛన్ కార్డులను వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం ఆధ్వర్యంలో ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పింఛన్లు వృద్ధులకు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 ఇవ్వడం లేదని,  కేవలం తెలంగాణలో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు నకిరే కంటి విజయ్, వెలుగు వెంకన్న, ఏస మల్ల సుశీల, భారతీ పుణ్యా నాయక్, మిట్ట గడుపుల అనుక్, ఉప్పునూతల ప్రణీత జెసి రెడ్డి, యాకు నాయక్, శారదా మాన్సింగ్, ఎంపీటీసీలు ఎలేజర్, వంటల కృష్ణ, మడ్డి నాగలక్ష్మి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది దశరథ, జిలాని, ఆయా గ్రామాల పంచాయతీ వార్డు సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.