మరుగున పడుతున్న ప్రభుత్వ విద్య

Submitted by Uppala Dasharatha on Fri, 16/09/2022 - 10:43
Disappearing public education

ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్ధకమే
రోజురోజుకు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

గుండాల సెప్టెంబరు 15(ప్రజా జ్యోతి).తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయింది అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది .పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు ఎవరికి వారే యమునా తీరే ,వచ్చామా వెళ్ళామా, నెలపూర్తిగానే జీతం పొందామా అనే చందంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరు  గుండాల మండలంలో తయారయింది. గుండాల మండలంలో 14ప్రాథమిక పాఠశాలలు,5 ప్రాథమికోన్నత పాఠశాలలు ,7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉండగా విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గిపోతూ ఉంది. గురువారం మండలంలోని తుర్కల షాపురం ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయినీలు పనిచేస్తుండగా  వారిలో ఒక్కరే  సమయానికి హాజరు అయి ప్రార్థన కార్యక్రమాలు పూర్తి చేయించారు. ప్రార్థన తర్వాత కూడా పాఠశాల గదుల తాళాలు వేసినవి వేసినట్టుగానే ఉండగా పిల్లలు ఏమి చేయాలో తెలియక వారు బ్యాగులతో అక్కడే గదుల బయట బిక్కుబిక్కుమంటూ నిలబడి వాళ్ళ టీచర్లు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసినటువంటి ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఇలాంటి ఉపాధ్యాయుల వలన మా పిల్లలను కూడా ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలని నిరుపేదలైన తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపడమే ఇక తప్పదని టీచర్లు ఇక చెప్పరని సమయానికి రారని ఇక చేసేది ఏం లేదని అప్పు చేసిన ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల అని ఆలోచిస్తున్నారు . ఇకనైనా వేలకు వేలు జీతాలు తీసుకోవడంతో పాటుగా సమయానికి వచ్చి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాలని ప్రభుత్వ పాఠశాల మనుగడను కాపాడాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.