డిచ్ పల్లి కి విద్యుత్ శాఖ డివిజన్ మంజూరు... ఉత్తర్వులు జారీ చేసిన సీ ఏం డి... ఏర్పాట్లలో విద్యుత్ శాఖ అధికారులు...

Submitted by SANJEEVAIAH on Wed, 11/01/2023 - 22:17
ఫోటో

డిచ్ పల్లికి విద్యుత్ శాఖ డివిజన్ మంజూరు

కొత్త పోస్టుల మంజూరు

నిజామాబాద్, ప్రజాజ్యోతి, జనవరి 11 :

నిజామాబాద్ విద్యుత్ శాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా డిచ్ పల్లి డివిజన్ మంజూరు అయింది. ఈ మేరకు వరంగల్ సిఎండి కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వుల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాత నిజామాబాద్ డివిజన్ పరిధి ని రెండుగా విభజించారు. ఇందులో కొత్తగా డిచ్ పల్లి డివిజన్ ను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ డివిజన్ లో  5 సబ్ డివిజన్ లు ఉండగా 16 ఆపరేషన్ సెక్షన్లు, 3 ఈ అర్ వో లు వచ్చాయి. డిచ్ పల్లి డివిజన్ పరిధిలో 2 సబ్ డివిజనల్ లు 12 ఆపరేషన్ సెక్షన్లు, ఒక  ఈ అర్ వో కార్యాలయాలు వచ్చాయి. పాత నిజామాబాద్ డివిజన్ లో 25 పోస్టులు ఉండగా మరో 5 పోస్టులు మంజూరు చేసి మొత్తం 30 పోస్టులను రెండు డివిజన్ల సర్దుబాటు చేశారు. 

నిజామాబాద్ డివిజన్ లో...

నిజామాబాద్ డివిజన్ లో నిజామాబాద్ టౌన్ -1, నిజామాబాద్ టౌన్ -2, నిజామాబాద్ టౌన్ -3, నందిపెట్, నవిపెట్ సబ్ డివిజన్ లు, 3 ఈ.అర్. ఓ.లు పని చేస్తాయి. సబ్ డివిజన్ నిజామాబాద్ టౌన్ -1 లో  డీ-1, డీ-6 ఆపరేషన్ సెక్షన్ లు ఉన్నాయి. నిజామాబాద్ టౌన్ -2 సబ్ డివిజన్ పరిధిలో డీ-2, డీ-3, డీ-5 ఆపరేషన్ సెక్షన్లు ఉన్నాయి. నిజామాబాద్ టౌన్ -3 సబ్ డివిజన్ లో డీ-4, బార్గాం, నాగారం సెక్షన్లు, నందిపెట్ సబ్ డివిజన్ పరిధిలో నందిపెట్, నూత్ పల్లి, మాక్లుర్, గొట్టు ముక్కుల సెక్షన్లు వస్తాయి. నవిపెట్ సబ్ డివిజన్ పరిధిలో నవిపెట్, జన్నేపల్లి సెక్షన్లు కొనసాగుతాయి.

డిచ్ పల్లి డివిజన్ లో...

డిచ్ పల్లి డివిజన్ పరిధిలో నిజామాబాద్ రూరల్, డిచ్ పల్లి సబ్ డివిజనల్ లు, ఒక్క ఈ.అర్. ఓ.లు పని చేస్తాయి. నిజామాబాద్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలో రూరల్, సారంగాపూర్, మొపాల్, బర్దిపుర్, ఆర్మూర్ సబ్ డివిజన్ కు జాక్రన్ పల్లి నీ మార్చారు. డిచ్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇందాల్ వాయి, దర్పల్లి, ఎల్లారెడ్డి పల్లి, ఆర్మూర్ కు సిరికొండ, గడ్కొల్ ను మార్పు చేశారు.  ఇకమీదట రెండు డివిజన్ ల పరిధిలో విద్యుత్ శాఖ విభాలు పని చేస్తాయి.