భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి పై ధర్నా

Submitted by Kramakanthreddy on Thu, 08/09/2022 - 17:37
Dharna against corruption in Palamuru Municipality under Bharatiya Janata Party
  • పాలమూరు మున్సిపాలిటీలోని రెవిన్యూ సెక్షన్ లో దాదాపు 25 లక్షల అవినీతి జరిగింది"
  • మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంజయ్య
  • పాలమూరు మున్సిపాలిటీ అంటేనే అవినీతి మున్సిపాలిటీ గా మారిపోయింది"
  • బి జె పి జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి

మహబూబ్నగర్ , సెప్టెంబర్ 8 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  "అవినీతి అంతం - బి జె పి సొంతం "  అంటూ  నినాదాలు చేస్తూ గురువారం ఉదయం  భారతీయ జనతా పార్టీ పట్టన శాఖా ఆధ్వర్యంలో పాలమూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి పై పాలమూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నిరసన  కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా బి జె పి పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ పాలమూరు మున్సిపాలిటీలోని రెవిన్యూ సెక్షన్ లో దాదాపు 25 లక్షల అవినీతి జరిగినదని, కానీ అవినీతికి పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందువలన భారతీయ జనతా పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నామని వారు అన్నారు .

ఇటీవల  ఒక కానిస్టేబుల్ ఇల్లు నెంబర్ ని మున్సిపల్ అధికారులు వారికి సంబంధించిన వారికీ డబ్బులు తీసుకొని ఆ ఇంటి నెంబర్ ని ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ,ఆ కానిస్టేబుల్  6 నెలలు తిరిగిన ఆయనకు న్యాయం జరగలేదని చివరకు కలెక్టర్ ని సంప్రదించాల్సి వచ్చిందని,  ఇలా రెవిన్యూ సెక్షన్ లో మ్యుటేషన్ వ్యవహారంలో గాని , నల్లాల కలెక్షన్ వ్యవహారంలో గాని  ఇళ్ల టాక్సే షన్ విషంయంలోగాని ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని అంజయ్య తెలియజేసారు . అనంతరం 3వ వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో వార్డులు  అభివృద్ధికి నోచుకోవడం లేదని కౌన్సిల్ లో మాట్లాడి బుడ్జెక్టు ప్రవేశపెట్టిన టెండర్లు పిలివడం లేదని , టీ అర్ ఎస్ ప్రభుత్వం అనుకున్నప్పుడే , అనుకున్నవారికే టెండర్లు ఇస్తున్నారని ఇది చాల దారుణమని తమ ఆవేదన వ్యక్తం చేసారు .

పాలమూరు మున్సిపాలిటీ అంటేనే అవినీతి మున్సిపాలిటీ అన్నట్టు మారిపోయిందని బి జె పి జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి  అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ యందు రెవెన్యూ సెక్షన్ కు సంబంధించి సిబ్బంది ప్రజల ద్వారా వసూలు చేసిన ఇంటి పన్నులు మరియు నల్ల బిల్లులకు సంబంధించిన దాదాపుగా 25 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని , అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన షాపుల అద్దె విషయంలో కూడా సంబంధిత అధికారులు అవినీతికి పాల్పడ్డారని , స్థానిక మంత్రి తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఫ్లెక్సీల రూపంలో మున్సిపాలిటీకి సంబంధించిన విలువైన నిధులను దారి మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ,  మున్సిపాలిటీలో హరితహారం పేరుతో నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని   కావున పై అన్ని నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు .

ఈ కార్యక్రమంలో బి జె పి కౌన్సిలర్లు , పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి ,  బి జె పి టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి , మండల్ ప్రెసిడెంట్ వీర రెడ్డి , బి జె వై ఎం అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి , ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ , బి జె వై ఎం జిల్లా కోశాధికారి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .