పత్రిక సంపాదకుడిగా దీన్ దయాల్ సేవలు మరువలేనివి.. -ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి..

Submitted by narsimlu on Sun, 25/09/2022 - 16:58
 Deen Dayal's services as editor of the magazine are unforgettable. -Ghananga Pandit Deen Dayal Upadhyaya 106th birth anniversary..

తాండూరు సెప్టెంబర్ 25 ప్రజా జ్యోతి :- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని  భారతీయ జనతా పార్టీ తాండూర్ ప్రధాన కార్యాలయంలో శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  106వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు. అనంతరం  పలువురు బిజెపి నేతలు మాట్లాడుతూ 1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షులయ్యారని తదనంతరం  1967 లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారని తెలియజేశారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలను చేపట్టి విజయ పదంలో నడిపించారని గుర్తు చేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ వార పత్రిక పాంచ జన్య,లక్నో దినపత్రికలతో అనేక రంగాలలో సంపాదకీయులుగా వ్యవహరించారని పేర్కొన్నారు.  ఏకాత్మత మానవతావాదం ప్రవచించి సమాజంలో అట్టడుగున ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశ్యంతో  అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్ కన్వీనర్ భాను పవర్, సీనియర్ నాయకులు పూజారి  పాండు, మడపతి ప్రభు శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, కార్యదర్శి సి ప్రకాష్, మీడియా ఇన్ఛార్జీ కొత్తూర్  చంద్రశేఖర్  తదితరులు పాల్గొన్నారు.