భద్రాచలం దేవస్థానంలో దసరా ఉత్సవాల తేదీలు ఖరారు

Submitted by kranthikumar.dasari on Sun, 11/09/2022 - 17:47
Dasara festival dates finalized at Bhadrachalam Devasthanam

భద్రాచలం, సెప్టెంబరు11 ప్రజాజ్యోతి:- భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవ స్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు శరన్నవ రాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు . 5న విజయదశమి సందర్భంగా సంక్షేప రామాయణ హోమం , పూర్ణాహుతి , మహాపట్టాభిషేకం నిర్వహించ నున్నారు . దసరా మండపంలో విజయోత్సవం , శమీ , ఆయుధపూజలు , శ్రీరామలీలా మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

26 నుంచి అమ్మవారి అలంకారాలు

 

శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని 26వ తేదీనుంచి లక్ష్మీతాయారు అమ్మవారి అలంకారాలు ఆరంభంకానున్నాయి . అందులో భాగం గా 26 న ఆదిలక్ష్మి అలంకారం ( బాలకాండ ) , 27 న సంతానలక్ష్మి ( అయోధ్య కాండ ) , 28 న గజలక్ష్మి ( అయోధ్యకాండ ) 29 న ధనలక్ష్మి ( అరణ్యకాండ ) , 30 న ధాన్యలక్ష్మి ( కిష్కింధకాండ ) , అక్టోబరు ఒకటిన విజయలక్ష్మి ( సుంద రాకాండ ) , 2 న ఐశ్వర్య లక్ష్మి ( యుద్ధకాండ ) 3 న వీరలక్ష్మి ( యుద్ధకాండ ) , 4 న మహాలక్ష్మి ( యుద్ధకాండ ) అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు . 26 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీరామాయ పారాయణోత్సవాల కారణంగా సంధ్యాహారతి నిలిపివేస్తారు . 27 నుంచి 5 వరకు సంక్షేప రామాయణ హోమం నిర్వహించనున్నారు.

 

అక్టోబరు 9 న శబరిస్మృతి యాత్ర

 

భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో 9న వాల్మీకి జయంతి , శబరి స్మృతి యాత్రలను నిర్వహించనున్నారు . దేవస్థానం గత కొన్నేళ్లుగా శబరిస్మృతి యాత్రను నిర్వహిస్తోంది . అక్టోబరు 25న పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆలయం మూసివేయనున్నారు . తిరిగి గ్రహణం అనంతరం రాత్రి 7.10 గంటలకు ఆలయం తెరిచి శుద్ది కార్యక్రమాలు నిర్వహించి దర్బారుసేవ నిర్వహించనున్నారు.