వాలీబాల్ పోటీల విజేత దమ్మూర్ ఎస్పీ చేతులమీదుగా బహుమతుల ప్రధానం

Submitted by srinivas on Wed, 28/09/2022 - 12:20
Dammur is the winner of the volleyball competition Head of gifts by SP

మహాదేవపూర్  , సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి ..//... మండల కేంద్రం లో నిర్వహించిన రెండు  మండలాల వాలీబాల్ పోటీలు ఉత్కంఠగా జరుగగాపలిమెల మండలం  దమ్మూరు జట్టు మొదటగా నిలిచింది.  కార్యక్రమానికి ఎస్పీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటగా నిలిచిన దమ్మూర్ జట్టుకు షీల్డ్ తో  పాటు పదివేల రూపాయల బహుమతిని ఎస్పి  అందించారు. తరువాత స్థానాలలో రెండవ స్థానంలో నిలిచిన అంబట్ పల్లి జట్టుకు జ్ఞాపిక మరియు అయిదు వేల బహుమతి, మూడవ స్థానంలో నిలిచిన బోడాయిగూడెం జట్టుకు రెండు వేల రూపాయల బహుమతి మరియు నాలువగ స్థానంలో నిలిచిన ఎడపల్లి జట్టుకు రెండు వేల రూపాయల బహుమతిని అందించారు. ఈ టోర్నమెంట్ లో గెలిచిన జట్లకు బహుమతులతో పాటుగా వాలీబాల్ కిట్లను పోలీసులు అందించారు. ఈ సంధర్భంగా ఎస్పి మాట్లాడుతూ మారు మూల ప్రాంతం నుండి గొప్ప క్రీడాకారులు రావడం గొప్ప విషయమని అన్నారు. త్వరలో జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు సిద్దంగా ఉండాలని, పోటీలకు తగిన కసరత్తులు చేసుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రతిభ కలిగిన క్రీడాకారులకు మంచి అవకాశం కల్పించిన పలిమెల ఎస్సై అరుణ్ మరియు మహదేవపూర్ ఎస్సై రాజ్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి సురేందర్ రెడ్డి, కాటారం సిఐ రంజిత్ రావ్, మహదేవపూర్ ఎస్సై రాజ్ కుమార్ పలిమెల ఎస్సై అరుణ్,  మరియు కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు.