ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Submitted by Srikanthgali on Mon, 26/12/2022 - 15:54
CPI 98th Foundation Day Celebrations

ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పేద ప్రజల జెండా ఎర్రజెండా-మునిగడప పద్మ

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 26, ప్రజాజ్యోతి: కార్మిక, కర్షక, మధ్య తరగతి వర్గాల హక్కుల కోసం పోరాడేది, హక్కులను సాధించేది ఎర్రజెండా ఒక్క టేఅని ఎర్రజెండా పేద ప్రజల జెండా అని 10వ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ పునర్ఘటించారు. సోమవారం లక్ష్మీ టాకీస్ ఏరియా, నాగయ్య గడ్డ ఏరియాలో భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ జెండా ఆవిష్కరించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 98 సంవత్సరాలు అవుతుందని అనేక రాజకీయ పార్టీలు దేశంలో, రాష్ట్రాల్లో పుట్టుకొచ్చి కనుమరుగయాయని అన్నారు. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు పేద ప్రజల,అణగారిన వర్గాలకోసం పోరాడుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఎప్పటికైనా కమ్యూనిస్టు పార్టీల ఆవశ్యకత ఉందని ప్రజలు గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, నాయకులు గంటాడి. కోటేశ్వరరావు, బయన ఈశ్వరయ్య, రామ్ రాకేష్, అజరయ్య, ఆనంద్, కన్నయ్య, ఎస్ కే మీరా, మహిళా నాయకురాలు ముద్ద ఏం మార్తమ్మ, గ్రేస్ అమ్మ, వెంకటలక్ష్మి, ఫాతిమా, సల్మా, అబ్బాస్, రామ్ రాజం తదితరులు పాల్గొన్నారు.