అనంతగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి మద్యం దుకాణంలో నకిలీ మద్యం కలకలం.

Submitted by sai teja on Mon, 19/09/2022 - 12:45
Counterfeit liquor in Sri Sai Liquor shop in Anantgiri mandal centre.

  మద్య దుకాణంలో సోదాలు
  నిర్వహించిన స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు.
  10 సిగ్నేచర్ మద్యం బాటిళ్లు సీజ్ చేసిన అధికారులు.

 అనంతగిరి సెప్టెంబర్18, ప్రజా జ్యోతి:  మండల కేంద్రంలోని శ్రీ సాయి మద్యం దుకాణంలో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించి కల్తీ మద్యం ను సీజ్ చేయడం మండలంలో తీవ్ర కలకలం రేపింది సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని శ్రీ సాయి మద్యం దుకాణంలో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించి 10 సిగ్నేచర్ 180 మి లి మద్యం బాటిళ్ల ను అధికారులు సీజ్ చేశారు ఈ విషయంపై స్థానిక ఎక్సైజ్ సి ఐ విజయ లక్ష్మి నీ వివరణ కోరగా శ్రీ సాయి మద్యం దుకాణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేసి మద్యం బాటిళ్లను సీజ్ చేశారని తెలిపారు ఈ నివేదికను ఉన్నత అధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటాం అని అన్నారు.శ్రీ సాయి మద్య దుకాణం విషయంలో హై డ్రామామండల కేంద్రంలోనీ శ్రీ సాయి మద్యం దుకాణం విషయంలో మండలంలో ఆదివారం హై డ్రామా నడిచింది రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం ఉదయం 8 గంటలకు సోదాలు నిర్వహించి 10 సిగ్నేచర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకునీ సంబంధిత అధికారులకు బాటిళ్లను అందించారు ఉదయం 8 గంటలకు మద్యం బాటిళ్లను సీజ్ చేసిన సంబంధిత అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంచడం విడ్డూరం కల్తీ మద్యం ఇంకా చాలా వరకు ఉంటాయని మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మద్యం సీజ్ చేసిన విషయం బయటకు పొక్కడంతో సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ అధికారి కార్యాలయంలో లేకపోవడం గమనార్హం ఈ విషయం పై సంబంధిత అధికారిని చారవానిలో వివరణ కోరగా మద్యం దుకాణం పై నివేదిక పై అధికారులకు అందించి తదుపరి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ఎది ఏమైనా చట్టాలను కాపాడాల్సిన అధికారులే కల్తీ వ్యాపారం చేసే వారికి ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు కల్తీ మద్యం వలన ప్రజలు ప్రాణాలను కోల్పోవలసిన పరిస్థితి వస్తుందని వాపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్తీ మద్యం అమ్ముతున్న మద్యం దుకాణం ను సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.