కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 14:33
Core Carbon X Solution Private Limited and Swami Vivekananda Rural Development Corporation

మద్దిరాల మండలం
సెప్టెంబర్ 1 (ప్రజా జ్యోతి)

మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో ఈరోజు రైతులకు వరి సాగులో తడిపడి విధానం గురించి జిల్లా మేనేజర్ ఎండి జీ సాన్ గారు వివరించడం జరిగింది. ఈ విధానంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడం వల్ల వ్యవసాయంలో నీటి సమర్థ యజమాన్య పద్ధతులను పాటించడం ఎంతో అవసరం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా సగం కంటే ఎక్కువ జనాభా ప్రధాన ఆ ఆహార పంటగా వరి దీనిని పండించడానికి ఎక్కువ మోతాదులో నీరు అవసరం ప్రస్తుతం మనం వరి పండించే పద్ధతి కిలోబియ్యం ఉత్పత్తి చేయడానికి మూడు వేల నుండి 5 00 నీరు అవసరం ఉంటుంది ఇది ఇతరహార ధాన్యాల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగం కంటే రెండు మూడు రెట్లు అధికం కనుక తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదకత సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తక్కువ నీటితో దిగుబడులు తగ్గకుండా పండించడానికి మరియు వాతావరణ పరిరక్షణకు కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ మరియు స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో వారిలో తడి పొడి సాగు నీటి యజమాన్యం తగ్గడంతోపాటు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది అంతేకాకుండా వాతావరణానికి ప్రమాదకారి కాలుష్య కారకమై మీథేన్ వాయువు విడుదల కూడా ఈ పద్ధతిలో తగ్గుతుంది

ఈ విధానంలో వరి సాగు చేయడం వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది  చేను కింద పడిపోదు చీడపీడలు ముఖ్యంగా దోమపోటు ఉధృతి ఉండదు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిలువేరు భవాని గారు మరియు సంస్థ కోఆర్డినేటర్స్ సిహెచ్ శరత్, ది భాను రైతులు జి మనోహర్ ఉపేందర్ మహేందర్ నాగార్జున తదితర 50 మంది రైతులు పాల్గొన్నారు