శిథిలావస్థలో ఉన్న తరగతి గదిని వంటగదిగా మార్చుకున్న వంట సిబ్బంది

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 10:18
A cooking crew converted a dilapidated classroom into a kitchen

దేవరకొండ -సెప్టెంబరు-13( ప్రజా   జ్యోతి )  డిండి మండలంలోని ప్రతాప్ నగర్  గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో నలభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల నందు  ఒక భవనం శిథిలావస్థలో ఉండడం మూలంగా వర్షాల వల్ల ఎప్పుడు కూలిపోతుందో అని ఉపాధ్యాయులు భయాందోళనకు గురై దాని నుండి విద్యార్థులను ఖాళీ చేయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మరొక భవనం చిన్నగా ఉండడం వలన ఉపాధ్యాయులకు విద్యాబోధన చేయుటకు ఇబ్బందికరంగా  ఉన్నది.అంతేకాక పాఠశాలకు వంటగది లేకపోవడంవల్ల ఆరుబయట వంట చేస్తున్నారు.కానీ  వర్షాకాలం కావడంతో వర్షాలు కురుస్తుండటంతో ఆరుబయట   వంట చేయుటకు వీలు కుదరక పోవడంతో అదే శిథిలావస్థలో ఉన్న తరగతి గదిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక సర్పంచ్ జర్పుల లక్ష్మి తిరుపతి  గత రెండు సంవత్సరాలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ నేటికీ ఆ సమస్య అలాగే ఉన్నది. కావున సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చివేసి నూతనంగా వంటగదిని మంజూరు చేయాలని అధికారులను కోరుచున్నాను.