పాఠశాల అదనపు గదుల నిర్మాణంలో -నాణ్యత పాటించాలి అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు .

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 13:23
In the construction of additional rooms of the school  - Maintain quality  Complaint to Additional Collector.

మిర్యాలగూడ ,సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ః మిర్యాలగూడ మండలం లోని జప్తివీరప్పగూడెం గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణ విషయంలో నాణ్యత పాటించాలి.అదేవిధంగా  గతంలో ఉన్న తరగతి గదులు, టాయిలెట్, మరుగుదొడ్లు నిర్మాణాలు 40 ఏళ్లల క్రితం నిర్మాణం కోసం కాంట్రాక్టు తీసుకుని పాత సిమెంట్ పాత గోడలపైన నూతన నిర్మాణం చేప్పడుతున్నారు. ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీని గురించి అడిగితే ఇంతే చేస్తాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా వివరిస్తున్న జప్తివీరప్పగూడెం సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు .అదేవిధంగా గ్రామంలో త్రాగునీరు పైపులు పలుచోట్ల లీకేజీలు ఏర్పడి పారిశుధ్యం లోపించి గ్రామంలో ప్రజలు విష జ్వరాలు బారీన పడుతున్నారు . ఈ విషయాన్ని గుర్తించి గ్రామ ప్రజలు ఆయు ఆరోగ్యాలతో కాపాడాలని కోరుతూ పై విషయాలు పరిశీలించి విచారణ జరపాలని సత్వరమే చట్టరీత్యా ప్రజాధనాన్ని ,పంచాయతీ నిధులను  దుర్వినియోగం కాకుండా అక్రమాలకు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు .