గిరిజన ఆశ్రమ పాఠశాలని తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Submitted by srinu jogu on Sun, 04/09/2022 - 12:43
Congress party leaders inspected the tribal ashram school
  • ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు
  • కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్

చౌడాపూర్(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 3: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ చదువుకు ఆమడ దూరంలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రభుత్వ హాస్టళ్లను మరియు ట్రైబల్ వెల్ఫేర్స్, సోషల్ వెల్ఫేర్స్ అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూళ్లను ప్రారంభించి వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రభుత్వ హాస్టల్ ను ప్రారంభిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వెనుకబడిన వర్గాల హాస్టల్ లపై చిన్న చూపు చూస్తూ,విద్యార్థుల పాఠశాల ఆవరణలో కుళ్ళిపోయిన పదార్థాలతో చుట్టుపక్కల పరిశుభ్రత పాటించకుండా చల్లా చదరంగా మలవిషర్ధనులు, పురుగుల అన్నం పెడుతూ,సరైన పరిశుభ్రత లేకుండా చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ,వెనకబడిన వర్గాల విద్యార్థులను మళ్లీ వెనకకి నెట్టివేయాలని చూస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్ అన్నారు.

ఇలాగే ప్రభుత్వ హాస్టల్ లపై చిన్న చూపు చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వాన్నికి కచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్,ఎస్టీసెల్ అధ్యక్షుడు శివరాం నాయక్ ,దామోదర్ రెడ్డి,సలీం వెంకటేష్ గౌడ్,రవి నాయక్,రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షులుచెన్నయ్య కావాలి కుర్మయ్య శేఖరు కర్ణ శీను సతీష్ శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.