సంస్థాన్ నారాయణపూర్ మండలంలో రోడ్ల దుస్థితి

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 14:19
Condition of roads in Sansthan Narayanapur mandal
  • అధ్వాన్నమైన రోడ్లు-  ఆందోళనకు సిద్ధమవుతున్న అఖిలపక్షాలు

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలోని రోడ్లు అద్వానస్థితికి చేరుకున్నాయి. చౌటుప్పల్ నల్గొండ వెళ్లే ప్రధాన రహదారి తప్ప మిగతా అన్ని రోడ్లు గుంతల మయంగా మారిపోయాయి.  గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి తంగడపల్లి వరకు అద్వాన్నంగా ఉన్న రోడ్డును ఇటీవలనే కొంతమేరకు మరమ్మతులు చేశారు.

మండలాలను కలిపే రోడ్లు,  గ్రామాలను కలిపే రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  సంవత్సరాల తరబడి రోడ్లను మరమ్మతులు చేయకపోవడం వల్ల వర్షాలకు లారీలు,  బస్సులు,  ఇతర వాహనాలు తిరిగి గుంతల మయంగా మారిపోయాయి. తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు దాటుతున్న గతంలో వేసిన రోడ్లను పట్టించుకోకపోవడం వల్ల నేడు ఈ పరిస్థితి ఏర్పడింది . సంస్థాన్ నారాయణపురం నుంచి జనగాం వైర్లెపల్లి అంతంపేట వెళ్లి ప్రధానమైన రోడ్డు పరిస్థితి మరి అధ్వానంగా మారింది. కిలోమీటర్కు సుమారు 100 నుంచి 150 వరకు గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. రోగులు,  గర్భిణీ స్త్రీలు ఆస్పత్రికి అత్యవసర పరిస్థితులలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాలు తిరుగలేని పరిస్థితి కలిగింది. మట్టి రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా మారింది.

ఇటీవల అఖిలపక్ష నాయకు లు వావిళ్ళపల్లి గ్రామంలో రోడ్ల దుస్థితిపై చర్చించారు,  రెండు మూడు రోజుల్లో ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు,  జనగాం, వావిళ్ళపల్లి  గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా మారింది,  దీనితో రాజకీయ పార్టీలన్నీ కలిసి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మునుగోడులో ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పథకాలను మంజూరు చేస్తున్నది , దీనికి స్పందిస్తున్న ప్రజలు తమ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడైతేనే రోడ్లు మరమ్మతు చేస్తారని ఆశ భావంతో ఉన్నారు, 

చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ఉత్సాహంగా పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల అనేకమంది కాంట్రాక్టర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్లు బిల్లు రాకపోవడం వల్ల చితికిపోయారు. అప్పులు మిత్తిలు చెల్లించలేక ఉన్న ఆస్తులను సైతం అమ్ముకున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు తమకు రావలసిన బిల్లులు ఆయన ఇస్తే చాలని కోరుకుంటున్నారు. తెలంగాణ వస్తే తమ బాగుపడతావ్ అనుకున్నా కాంట్రాక్టర్లు ప్రభుత్వ వైఖరి వల్ల చితికిపోయి దారుణ స్థితికి చేరుకున్నారు. సంవత్సరాల తరబడి చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వల్ల ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు అంటేనే ఆమడ దూరం అరగేత్తే పరిస్థితి ఏర్పడింది.