కలెక్టర్ శివలింగయ్య ప్రభుత్వ అధికారా? అధికార పార్టీ నాయకుడా?

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:35
Is Collector Shivalingaiah a government authority? The leader of the ruling party?

తక్షణమే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి

వికలాంగులు,  మహిళలు అంటే అంత చులకనగా ఉందా..? 

కలెక్టర్ పై ఎచ్ఆర్సి లో ఫిర్యాదు చేస్తాం

ఎన్పిఆర్డీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్. 

జనగామ, సెప్టెంబర్ 21,ప్రజాజ్యోతి:-  ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేవిధంగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాసేవకుడిగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్ శివలింగయ్య సభ్యసమాజం సిగ్గుపడేవిధంగా హక్కులు, భాద్యతలు మరిచి కలెక్టర్ హోదా, హుందాతనం మరిచి నీచంగా అనుచిత వ్యాఖ్యలు  చేసిన కలెక్టర్ శివలింగయ్య జిల్లా కలెక్టర్ ఉద్యోగానికి రాజినామా చేసి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి పార్టీ కండువా వేసుకొవాలని, లేదా జనగామ జిల్లా నుండి బదిలీపై వెళ్లాలని, లేనిపక్షంలో వికలాంగులను సమీకరించి ఉద్యమిస్తామని, అలాగే కలెక్టర్ ప్రవర్తనపై ఎచ్ఆర్సి కీ ఫిర్యాదు చేస్తామని ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ తెలిపారు. బుధవారం  జనగామ పట్టణంలోని ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) పట్టణ ముఖ్య బాద్యుల సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ ఆల్ ఇండియా క్యాడర్ పరీక్ష వ్రాసి, ట్రేనింగ్ లో ప్రజలతో ఎట్లా ఉండాలి, వారి సమస్యలు ఎలా పరిష్కారం చేయాలి, ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరేవిధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజాసేవకుడు, బాధ్యత గల్గిన జిల్లా కలెక్టర్ శివలింగయ్య ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సెల్ లో వికలాంగులు, వికలాంగుల ప్రతినిధులు నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా జనగామలో నిర్మించిన నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వారిగోడు వినిపించుకోవడానికి వచ్చిన వికలాంగులను,  వికలాంగుల నాయకులను అవమానపరిచే విధంగా బాధ్యతారాహిత్యంగా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఖాళీగా లేవు, ఉన్నది ఒక ఖాళీ అది నా కుర్చీ మాత్రమే  తీసుకుంటావా అంటూ వెటకారంగా సమాధానం చెప్పడం జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించారు

. కలెక్టర్ గా వచ్చి ఒక సంవత్సర కాలం అవుతున్న ఇప్పటివరకు జిల్లాలో  వికలాంగుల సమస్యలు తెలుసుకోవడంగాని, 2016 వికలాంగుల చట్టం అమలు తీరు గురించిగాని వికలాంగుల సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించక పోవడం కలెక్టర్ చొరవ అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. గతంలో వారధి ఏజెన్సీ ద్వారా జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూల్ లలో ఉద్యోగాలు చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఏజెన్సీ మారటంతో  తను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వరంగల్ లక్షల రూపాయలు అడుగుతున్నారని జిల్లా కలెక్టర్ ను కలుసుకొని వాటిగోడు చెప్పినప్పటికీ కలెక్టర్  మాకేమిసంబంధం లేదు మీరు, ఏజెన్సీ వాళ్ళే మాట్లాడుకోవాలని బాధ్యాతారహితంగా మాట్లాడం వల్ల ఉన్న ఉపాధి పోతుందని   ఒక్కొక్కరు లక్షల రూపాయలు అప్పుల తెచ్చి చెల్లించాల్సిన దుస్థితి ఎవరివల్ల వచ్చిందన్నారు. ప్రజలు ఎవరైనా కలెక్టర్ అనే హోదా ఉన్నది కాబట్టే వారు వారి సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి కలెక్టర్ వద్దకు వస్తారనే సంస్కారం లేకపోతే ఎట్లా అని విమర్శించారు. ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవచేసి జిల్లా ఉన్నత అధికారి స్థాయిలో ఉన్న అధికారి మాట్లాడేమాటలు ఇవేనా అని అన్నారు. ప్రజలే లేకుంటే అధికారులు, పరిపాలన  ఎక్కడినుంచి వచ్చిందని తెలిపారు. నిన్న (సెప్టెంబర్ 20న) జనగామ పట్టణానికి చెందిన ఇందిరమ్మ మూడవ విడత డబల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులు, సిపిఎం నాయకత్వం ఇండ్ల సమస్యపై పాదయాత్ర చేసి, ఈ సమస్యను కలెక్టర్ తో  మాట్లాడటానికి పార్టీ నాయకత్వం, లబ్ధిదారులు కలెక్టర్ చాంబర్ లోకి వెళ్లడం జరిగింది. లబ్ధిదారులైన ఒక మహిళ, సమస్యను కలెక్టర్ గారితో చెబుతుండగా ఫోటోకు ఫోజులు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నావా అంటూ నాయకత్వాన్ని, లబ్ధిదారులతో అనుచితంగా మాట్లాడడం జరిగింది.
కలెక్టర్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారా, అధికారపార్టీ నాయకుల మెప్పుకోసం పనిచేస్తున్నారని జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పై ఉందని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ శివలింగయ్య ప్రజలకోసం కాదు అధికాపార్టీ కోసం పని చేస్తున్నానంటే తక్షణమే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పార్టీ కండువా కప్పుకోవాలనిపిస్తే కప్పుకోవచ్చనీ తెలిపారు. గతంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు అధికారపార్టీ కండువాలు కప్పుకున్న ఘటనలు చాలా ఉన్నాయని, ఇదేదీ కొత్తకాదని హెద్దేవా చేశారు. వెంటనే కలెక్టర్ శివలింగయ్య జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి కలెక్టర్ పదవికి రాజీనామా చేయాలని, (లేదా) జనగామ జిల్లా నుండి బదిలీ చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై వికలాంగులను అవమానించే విధంగా మాట్లాడి, వారి మనోభావాలకు భంగం కల్పించిన జిల్లా కలెక్టర్ పై 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, అలాగే మానవ హక్కుల కమిషన్ కు ఎన్పిఆర్డి  ఆధ్వర్యంలో పిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, మామిడాల రాజేశ్వరి, మోతె వెంకటమ్మ, నాచు అరుణ, ఇట్టబోయిన మధు, తోట సురేందర్, పిట్టలకుమార్, రావుల శ్రీనివాస్, కామరాతి వినయ్, నామాల రాజు, మాలోతు రాజ్ కుమార్ బైరగోని మహేష్ తదితరులు పాల్గొన్నారు.