పక్కా ప్రణాళికతో లక్ష్యం సాధించాలి. కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by srinivas on Wed, 28/09/2022 - 12:32
Collector Bhavesh Mishra said the target should be achieved with a well-planned plan


భూపాలపల్లి,ప్రతినిధి  సెప్టెంబర్, 27 ప్రజాజ్యోతి.//.  జిల్లాలో పక్కా ప్రణాళికలతో ఆయిల్ పామ్ మొక్కల పెంపకం లక్ష్యం సాధించాలని దానికి అనుగుణంగా  క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టర్ చాంబర్ లో ఉద్యాన శాఖ అధికారులు , సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్, డ్రిప్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లతో  ఆయన ఆయిల్ పామ్ సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 2022-23 సంవత్సరమునకు జిల్లాకు 6615 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం కేటాయించటం జరిగిందని, సువే న్  ఆయిల్ పామ్ కంపెనీ ద్వారా మొక్కల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించాలని, మొక్కలను, పరికరాలను అందించాలని, ఆయిల్ పామ్ సాగులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 333 మంది రైతులకు గాను 1146 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం మంజూరు చేయగా 267 మంది రైతులకు గాను 846 ఎకరాల్లో ఆయిల్ ప్లమ్ ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగిందని అధికారులు వివరించారు. ఉద్యాన శాఖ అధికారులు మండల వ్యవసాయ,  వ్యవసాయ విస్తరణ అధికారుల సహకారంతో ఆయిల్ పామ్ సాగు విస్తరణకై లబ్దిదారులను గుర్తించాలని, ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తిగల రైతుల పొలాలను వెంటనే సర్వే చేసి, పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన, శిక్షణా కార్యక్రమాల కోసం రైతు వేదికలను ఉపయోగించాలని, సాగు పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ లో సమాచారం అందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి సంజీవ రావు, సువేన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎం డి గౌతమ్ రెడ్డి  డ్రిప్ ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.