ఆర్థిక భరోసా గా సీఎం సహాయం నిధి

Submitted by sai teja on Thu, 22/09/2022 - 13:06
CM's relief fund as financial security

సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం

మండల టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు గింజుపల్లి రమేష్
అనంతగిరి ,సెప్టెంబర్21, ప్రజా జ్యోతి: వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు సీఎం సహాయ నిధి నిలుస్తుందని మండల టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు  గింజుపల్లి రమేష్ అన్నారు. బుధవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీద గా అనంతగిరి మండలానికి చెందిన 10 మంది కుటుంబాలకు అందజేశారు.అనంతరం  రమేష్ మాట్లాడుతూ... సీఎం సహాయనిధి పేద ప్రజలకు వెలుగు నింపుతుందని అన్నారు.వెంకట్రాంపురం ఖానాపురం గ్రామాలలో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కానాపురం సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు, వెంకట్రాంపురం సర్పంచ్ కొండపల్లి రాణి,వెంకట్రాంపురం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేవల్ల కృష్ణ, ఉప సర్పంచ్ సత్యనారాయణ, కొండపల్లి జాను తదితరులు పాల్గొన్నారు.