పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ...జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

Submitted by bosusambashivaraju on Sat, 01/10/2022 - 12:09
CM KCR's aim is the welfare of the poor ...ZP Chairman Pagala Sampath Reddy

చిల్పూర్, సెప్టెంబర్ 30, (ప్రజాజ్యోతి ) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిల్పూర్ మండలంలోని వెంకటేశ్వర పల్లె, తీగల తండా గ్రామంలో సర్పంచ్ తోకల దివాకర్ రెడ్డి, లక్ష్మీ ఠాగూర్ ల అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్
 పాగాల సంపత్ రెడ్డి  హాజరై మహిళలకు బతుకమ్మ చీరలు,    లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను దేశవ్యాప్తం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను దేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచనలతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా సంచలన రాజకీయ నాయకుడిగా చరిత్రలోకి ఎక్కారన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను  సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు. సీఎం కేసీఆర్ తోనే మన తెలంగాణ బతుకమ్మ విశ్వ వ్యాప్తమైందన్నారు.  బతుకమ్మ చీరలతో తెలంగాణ నేతన్నలకు మెరుగైన ఉపాధి లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపిటిసి  ఎన్న కూస కుమార్, ఉప సర్పంచులు కొమురమ్మ, నరసింహ, నాయకులు రంగు రవి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీ ఓ మధుసూదన్ చారి ,గ్రామ  పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.