మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్

Submitted by mallesh on Tue, 27/09/2022 - 15:46
CM KCR Etela Rajender has turned Telangana into a state of debt with a surplus budget

 బిజెపి పార్టీలో చేరిన 500 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు

 చౌటుప్పల్ సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి)  ..// మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి కోసం, పదవి పార్టీ కోసం వచ్చిన ఎన్నిక కాదని, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నికని హుజూర్నగర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం దేవలమ్మ నగరం గ్రామంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వరకాంతం జంగారెడ్డి, మాజీ సర్పంచ్ వరకాల మహేందర్ గౌడ్, సుమారు 500 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు బిజెపిలో ఆహ్వానించారు. అనంతరం ధర్మాజీగూడెం సర్పంచ్ బాల్యం లావణ్య మల్లేశం చౌటుప్పల్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీ చేరారు.ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన కుటుంబం లోని వ్యక్తులకు పదవులు కట్టబెట్టి ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కమిషన్ల రూపంలో సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కెసిఆర్ కొడుకు కూతురు అల్లుడు రాజకీయ భవిష్యత్తు కోసం రాచరిక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు న్యాయం  చెయ్యలేడాని ఎద్దేవ చేశాడు. ఈ సందర్భంగా కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ60 ఏళ్ల తెలంగాణ పోరాటంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూసి తన ఎంపీ పదవీ రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర కోసం  పోరాటం చేశానని పేర్కొన్నారు. 40 ఎకరాల భూమి ఉన్న ఉద్యోగస్తులకు రైతుబంధు ఇవ్వడం వలన భూమిని నమ్ముకుని బతుకుతున్న నిజమైన రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు.

ఫామ్ హౌస్ లో పండుకున్న కెసిఆర్ కు రైతుల సమస్యలు ఏమి తెలుస్తాయని ధ్వజమెత్తారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు రుణమాఫీ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ రాష్ట్రం ను ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం దిగజారింది అన్నారు. ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక లేకుండా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, దూడల బిక్షం గౌడ్, రమణ గోని శంకర్, ఉబ్బు వెంకటయ్య , కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ,ఉడుగు వెంకటేశం గౌడ్, ఎంపిటిసి రాజమ్మ అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, సురుగు శ్రీనివాస్ గౌడ్ ,పంతంగి సర్పంచ్ బాత రాజు సత్యం ,బక్క శ్రీనాథ్ సురుగు మల్లేశం రేవల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.