పారిశుద్ధ్య స్థితిగతులను పరిశీలించిన పౌర సంఘాలు.

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:27
Civil Society Monitored Sanitation Status.

హనుమకొండ, సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)./... బల్దియా పరిధిలో మహానగర పాలక సంస్థ అవలంబిస్తున్న పారిశుద్ధ్య విధానాలను, మారుగుదొడ్ల నిర్వహణలో చేపడుతున్న చర్యలను, ఆస్కి అద్వర్యం లో కొనసాగుతున్న వివిధ రకాల పద్ధతులను వరంగల్  పౌర సంఘాల నాయకులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న మల వ్యర్థాల శుద్దికారణ కేంద్రాన్ని (ఎఫ్.ఎస్.టి.పి), హన్మకొండ లోని అంబెడ్కర్ నగర్ లో గల మురుగు నీటి వ్యర్థాల శుద్దికరణ కేంద్రాన్ని (ఎస్.టి.పి)కేంద్రాన్ని, మడికొండలోని సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్.టి.పి. కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పౌర సంఘ నాయకులు మాట్లాడుతూ నగరంలోని అపార్ట్మెంట్లు,గృహాలు తప్పనిసరిగా 3 సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆస్కి ప్రతినిధి రాజ్ మోహన్ మాట్లాడుతూ ఇలాంటి పర్యటనలు ప్రజల్లో పారిశుద్యం పట్ల అవగాహన పెంచడానికి దోహదం చేస్తాయని, బల్దియా తరపున సెప్టిక్ ట్యాంక్ లను శుభ్రపరచుకోవడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి నెంబర్ కు సమాచారం ఇవ్వడం వల్ల శుభ్రపరచుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరి సుధాకర్, ప్రో. రతన్ సింగ్ వెంకటేశ్వరరావు, మండల పరుశరాములు, వళ్ళంపట్ల నాగేశ్వరరావు, జి. యాదగిరి, కవిత, సుమలత, పరికిపండ్ల వేణు ,రాజ్ కుమార్, కాళిదాసు, పురుషోత్తం, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.