పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

Submitted by lenin guduru on Wed, 28/09/2022 - 12:09
Chief Minister KCR's rule is aimed at the welfare of the poor  ZP Chairman Sampath Reddy


చిల్పూర్, సెప్టెంబర్ 27, ప్రజాజ్యోతి:-  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిల్పుర్ మండలంలోని రాజవారం గ్రామంలో సర్పంచ్ మారేపల్లి తిరుమల అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి హాజరై ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా జెడ్పీ చైర్మన్  సంపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తం చేసిన నాయకుడు కేసీఆర్  అని కొనియాడారు.బతుకమ్మ పండుగ కానుకగా చీరలు, అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వడం  జరుగుతుందని ఆయన తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు,  బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు, దేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచనలతో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా సంచలన రాజకీయ నాయకుడిగా చరిత్రలోకెక్కారని అన్నారు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సీఎం కేసీఆర్  దేశవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు,సీఎం కేసీఆర్ తోనే మన తెలంగాణ బతుకమ్మ విశ్వవ్యాప్తమయిందన్నారు, సంస్కృతి సంప్రదాయాలకు మన తెలంగాణ పెట్టింది పేరని, దానిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన అన్నారు. 

బతుకమ్మ చీరలతో నేతన్నలకు మెరుగైన ఉపాధి లభించిందని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి సందర్భంగా మహానీయుడు లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యంపిటిసి మారేపల్లి లలితా దేవి, గ్రామ శాఖ అధ్యక్షులు యాకూబ్ పాషా, నాయకులు రంగు రవి, ఎడ్ల రాజేష్,డీలర్ ఎడ్ల  మల్లయ్య, ఎడ్ల రమేష్,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీఓ మధుసూదన్ చారి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.